ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

ABN , First Publish Date - 2021-01-19T05:17:59+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న అజీజ్‌, కోటంరెడ్డి

నగరంలో పలు చోట్ల రక్తదానాలు, అన్నదానాలు

ఎన్టీఆర్‌ సేవలను కొనియాడిన టీడీపీ నేతలు


నెల్లూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు  నివాళులర్పించారు. సోమవారం ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోనీ ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. పలుచోట్ల రక్తదానం, అన్నదానాలు నిర్వహించి ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దని కీర్తించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నగర ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు లెజండరీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 350 మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొదట కోటంరెడ్డి కుమారుడు డా. కోటంరెడ్డి ప్రజయ్‌సేనారెడ్డి రక్తదానం చేశారు. నర్తకీ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద అఖిలభారత ఎన్టీఆర్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు తాళ్లపాక రమే్‌షరెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాన్ని పూలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో అజీజ్‌, కోటంరెడ్డి, తాళ్లపాక  అనురాధలతోపాటు నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, నాయకులు జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, మామిడాల మధు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్‌, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌, పొత్తూరు శైలజ, రేవతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:17:59+05:30 IST