ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడు

ABN , First Publish Date - 2021-01-19T05:16:54+05:30 IST

సినీ, రాజకీయ రంగంలో అఖండ ఖ్యాతినార్జించిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని టీడీపీ బద్వేలు నియోజకవర్గ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడు
బద్వేలులో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

బద్వేలు, జనవరి 18 : సినీ, రాజకీయ రంగంలో అఖండ ఖ్యాతినార్జించిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని టీడీపీ బద్వేలు నియోజకవర్గ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా డాక్టర్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని నెల్లూరురోడ్డులో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2కే కిలో బియ్యం పథకం, ఇండ్లు, ఆస్థిలో మహిళలకు సమాన హక్కు కలిగించిన ఘనత ఒక్క ఎన్‌టీఆర్‌కే దక్కుతుందన్నారు.  టీడీపీ  జిల్లా  కార్యద ర్శి ఝాన్సీ, సీనియర్‌ నాయకులు నరసింహనాయుడు, టీడీపీ యువత జిల్లా అధికార ప్రతినిధి కొలవళి వేణుగోపాల్‌, జిల్లా టీడీపీ మైనార్టీసెల్‌ మాజీ ఉపాధ్యక్షుడు జహంగీర్‌బాష, ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దానం తదితరులు పాల్గొన్నారు.


మైదుకూరులో..... : 

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎన్టీయార్‌ 25వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, తదితరులు కలసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ ఎన్టీయార్‌తోనే తెలుగు ప్రపంచ ఖ్యాతి పొందిందన్నారు. టీడీపీ ఆకుల క్రిష్ణయ్య, నేట్లపల్లె మల్లిఖార్జున, ఆర్‌ శ్రీనివాసులు, ధనపాల జగన్‌, పాశం మారుతీ, శాంతినగర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.  


వేంపల్లెలో...: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రపటానికి వేంపల్లెలో టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.  టీడీపీ రైతు విభాగం పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌, జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేమనకు, ఎన్టీఆర్‌కు తులసి నివాళి: మహాకవి, యోగి వేమన, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేమన, ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని వేంపల్లెలో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు వేమన పద్యాలు ఇప్పటికీ ఎంతో ప్రభావితం చేస్తున్నాయని, రాజకీయ చైతన్యం తెచ్చేందుకు ఎన్టీఆర్‌ కృషిచేశారని తులసిరెడ్డి గుర్తుచేశారు.

Updated Date - 2021-01-19T05:16:54+05:30 IST