ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర

ABN , First Publish Date - 2022-05-29T04:07:54+05:30 IST

స్వర్గీయ నందమూరి తారకరాముని స్మరించుకుంటూ రామ దండు కదిలనట్లు ఒంగోలు మహానాడుకు శ్రేణులు తరలివెళ్లారు.

ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర

ఘనంగా నందమూరి శతజయంతి వేడుకలు

విగ్రహాలకు నివాళులు

అనంతరం భారీగా మహానాడుకు శ్రేణులు

ఉగ్ర సారథ్యంలో కదిలిన రామదండు 

కనిగిరి, మే 28 : స్వర్గీయ నందమూరి తారకరాముని స్మరించుకుంటూ రామ దండు కదిలనట్లు ఒంగోలు మహానాడుకు  శ్రేణులు తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్య కర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో మహానాడుకు బయలుదేరారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా అమరావతి గ్రౌండ్స్‌లో డాక్టర్‌ ఉగ్ర, నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ  తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీయార్‌ అన్నారు.  అనంతరం మహానాడుకు తరలివెళ్ళేందుకు కనిగిరి నుంచి భారీ వాహన శ్రేణితో తమ్ముళ్లు పయనమయ్యారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు.

వ్యూహంతో ముందుకు

మహనాడుకు వెళ్లేందుకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఉగ్ర ముందస్తు వ్యూహం రచించారు. మహానాడుకు వెళ్లేందుకు స్కూల్‌ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఇవ్వకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ఇది గుర్తించిన ఉగ్ర వేర్వేరు ప్రాంతాల నుంచి వాహనాలను రప్పించారు. అన్ని మండలాల నాయకులతో మాట్లాడి వారందరూ లక్ష్యం మేరకు మహానాడు మహాసభకు తరలివెళ్లేందుకు ప్రణాళిక చేశారు. ఉగ్ర రథసారధి అయి ముందుగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లగా వెనుక వాహనాలన్నీ రామ దండులా కదిలాయి. 

టీడీపీలోనే మహిళలకు గౌరవం

టీడీపీ మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వడంతోపాటు ప్రథమ తాంబూలం అందించే గౌరవించేది టీడీపీ ఒక్కటేనని పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ జయం తి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వారినుద్దేశించి తమ్మినేని మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఫిరోజ్‌, కరణం అరుణ, స్వప్న, దోసపాటి శివకుమారి  పాల్గొన్నారు. 

మహా ఉత్సాహంతో..

దర్శి : నియోజకవర్గం నుంచి మహానాడుకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ముందుగా దర్శిలో గడియార స్తంభం సెంటర్‌లో  ఎన్టీఆర్‌, ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఒంగోలు వెళ్లేందుకు పయనమయ్యే వాహ నాలను జెండా ఊపి పాపారావు ప్రారంభించారు. 90 లారీలు, 250 కార్లు, 1500 ద్విచక్రవాహనాలలో వేలాదిగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ముండ్లమూరు వద్ద టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌  భోజన వసతిని ఏర్పాటు చేశారు. భోజనాలు చేసిన అనంతరం ఒంగోలుకు పయనమయ్యారు.  కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, తెలుగు మహిళా నాయకురాలు ఎం.శోభారాణి, వైస్‌ చైర్మెన్‌ స్టీవెన్‌, పిచ్చయ్య  వాసు, సుబ్బారావు, గాలయ్య, బాలకృష్ణ, నారపుశెట్టి మధు, తిరుపతిరావు, షేక్‌ ఫరీద్‌, పఠాన్‌సుభాని, గోళ్లపాటి మార్క్‌ పాల్గొన్నారు. 

తాళ్లూరు : తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాల్లో  ఇనుమడింప చేసి ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ ఆరాధ్యదైవంగా నిలిచారని ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మానం రమేష్‌బాబు అన్నారు. ఎన్టీ ఆర్‌ జయంతిని టీడీపీ మండల నాయకులు నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్ర హానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మానం రమేష్‌ బా బు, ఇడమకంటి శ్రీనివాసరెడ్డి, గొందిరమణారెడ్డి, శివనాగిరెడ్డి, ముఖ్య నాయ కులు పాల్గొన్నారు.

మహానాడుకు దర్శి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పమిడి రమేష్‌ సారథ్యంలో  తరలివెళ్లారు.  కార్యక్రమంలో టీడీపీ నేతలు శాగంకొండారెడ్డి, మానం రమేష్‌బాబు, షేక్‌ కాలేషావలి, బి.ఓబుల్‌రెడ్డి, కె.సుబ్బారెడ్డి, రామకోటిరెడ్డి,  శ్రీనివాసరెడ్డి తదితరులు 400లకు పైగా వాహ నాల్లో ఒం గోలు బయలు దేరారు. కొత్తపాలెం గ్రామంలో కైపు రామ కోటిరెడ్డి ఎన్టీఆర్‌ జయంతి సంద ర్భంగా కేక్‌ కట్‌ చేసి పార్టీ జెండాను ఆవిష్కరిం చారు. 

ముండ్లమూరు :  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎం పీపీ మందలపు వెంకటరావు పూలమా లవేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసి అభి మానులకు పంచి పెట్టారు. ముండ్లమూరు బ స్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మేదరమెట్ల వెంకటరావు,  టీడీపీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ యువ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పసుపుగల్లు ఎస్సీ కాలనీలో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి మాజీ జడ్పీటీసీ వరగాని పౌలు, మాజీ సర్పంచ్‌ ఇందూరి పిచ్చిరెడ్డి  నివాళులర్పించారు. మండలంలోని సింగనపాలెం, తూర్పుకంభంపాడు, పెద ఉల్లగల్లు, కెల్లంపల్లి, బొప్పూడివారిపాలెం గ్రామాల్లో ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం 

మండుటెండలో కదిలిన మహిళలు, వృద్ధులు

మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. మహిళలు, యువకులు, వృద్ధులు మండుటెండను లెక్కచేయకుండా బ యలుదేరారు. మేదరమెట్ల వెంకటరావు, మాజీ జడ్పీటీసీలు వరగాని పౌలు, నాగరాజు,  సోమేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌లు  నారాయణ స్వామి, గజ్జల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.  

దొనకొండ :  దర్శి టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ ఆదేశాల మేరకు మం డల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు నేతృత్వంలో ర్యాలీగా మహానాడుకు పయనమయ్యారు. కార్యక్రమంలో మాజీ  జడ్పీటీసీ పులిమి రమణాయాదవ్‌, టీడీపీ నాయకులు మోడి వెంకటేశ్వర్లు, దుగ్గెంపూడి చెంచయ్య, కామేపల్లి చెంచయ్య,  చెన్నయ్య తదితరులు 50 వాహనాల్లో దొనకొండకు చేరి దొనకొండలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఒంగోలుకు తరలివెళ్లారు. 

కురిచేడు:  కురిచేడు మండలం నుంచి రెండువేల మంది నాయకులు, కా ర్యకర్తలు మహానాడుకు తరలివెళ్లారు. అధ్యక్షుడు నెమలయ్య ఆధ్వర్యంలో 20 లారీలు, 20కార్లు, సొంత వాహనాలలో శ్రేణులు వెళ్లారు.  

వెలిగండ్ల :  మహానాడుకు భారీగా తరలివెళ్లారు. 21 పంచాయతీల నుంచి శ్రేణులు వాహనాల్లో బయలుదేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి,  రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, తెలు గు యువత అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.  

పీసీపల్లి :  18 పంచాయతీల నుంచి 30 వాహనాల్లో టీడీపీ శ్రేణులు మహానాడుకు తరలివెళ్లారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమా లవేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఉగ్రతో కలిసి ఒంగోలుకు బయలుదేరారు. కాగా పెద్దఇర్లపాడుకు చెందిన వైసీపీ కార్యకర్త కాలం రమణయ్య ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. 

పామూరు : ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘ నంగా నిర్వహించారు. స్థానిక శేషమహల్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ చిత్రపటా నికి పూలమాల వేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రిచౌదరి, ఏలూరి వెంకటేశ్వర్లు, కె.సుభాషిణి, జి.చాన చెంచయ్య, షేక్‌ ఖాజారహంతుల్లా, ఎం.హుసేన్‌రావు, అమీర్‌బాబు,  హరిబాబు, సాంబయ్య, అడుసుమల్లి ప్రభకర్‌చౌదరి,  గౌస్‌ బా షా, రఫి,  మహిళా నాయకులు, ఎం రమాదేవి, రహీమున్నీసా, రమణ మ్మ, ఈశ్వరమ్మ, మస్తాన్‌బీ, నూర్‌బీ పాల్గొన్నారు.  50 వాహనాల్లో మహా నాడుకు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. శేషమహల్‌ థియేటర్‌ నుంచి మమ్మీ డాడి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 

సీఎస్‌పురం :  ఎన్టీఆర్‌ జయంతి వేడుకను బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహిం చారు. అనంతరం 40 వాహనాల్లో మహానాడుకు శ్రేణులు తరలివెళ్లారు.  కా ర్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, మండల ప్రధాన కార్యదర్శి  శ్రీనువాసులు, టౌన్‌ అధ్యక్షుడు పోకల రవిచంద్ర, మాజీ సర్పంచ్‌ ఎన్‌.సీ.మాలకొండయ్య, పార్టీ సీనీయర్‌ నాయకులు అట్లూరి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-29T04:07:54+05:30 IST