అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల మళ్లింపును వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. విధులు బహిష్కరించడంతో ఈరోజు జరపాల్సిన స్నాతకోత్సవాన్ని అధికారులు ఇప్పటికే వాయిదా వేశారు. గురువారం నుంచి జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ, సెకండ్ ఇయర్ బీఎస్సీ పారామెడికల్ పరీక్షలు కూడా వాయిదా వేశారు. త్వరలో మరో తేదీని ప్రకస్తామంటున్న యూనివర్సిటీ అధికారులు తెలిపారు.