ఎన్టీఆర్: జిల్లాలోని విసన్నపేట మండలం పుట్రేల వద్ద జరిగిన ఘటనలో నకిలీ నోట్ల ముఠాను విస్సన్నపేట పేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 47 లక్షల 50 వేల నకిలీ నోట్లను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేశ్ష్, తోట నరసింహారావులపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి