Abn logo
May 22 2020 @ 16:41PM

ఎన్టీయార్ అభిమానులు అప్పటివరకు ఆగాల్సిందేనా?

యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులను `ఆర్ఆర్ఆర్` చిత్రబృందం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీయార్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 20న `రామరాజు ఫర్ భీమ్` వీడియో వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆ వీడియో సిద్ధం కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 


లాక్‌డౌన్ ముగిసి షూటింగ్‌లకు అనుమతులు లభిస్తే ముందుగా `రామరాజు ఫర్ భీమ్` వీడియోను సిద్ధం చేయడంపైనే రాజమౌళి దృష్టి పెట్టనున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15న ఈ వీడియోను విడుదల చేయాలనుకుంటున్నారట. కాబట్టి, ఎన్టీయార్ అభిమానులు అప్పటివరకు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement