ఓవర్సీస్ సినిమా: ‘RRR’ మూవీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెల్బోర్న్లోని అభిమానులు తమ కార్లను ‘JAI NTR RRR’ అనే పదాలు వచ్చే విధంగా క్రమ పద్ధతితో పార్క్ చేశారు. అనంతరం ఆ దృశ్యాలను డ్రోన్‌తో చిత్రీకరించారు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం అమెరికా, కెనడాలోని అభిమానులు కూడా ఇదే తరహాలో ఓ వీడియోను రూపొందించి సామాజిక మాద్యమాల్లో వదిలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ అభిమానులు కూడా తగ్గేదే లే! అంటూ తమ అభిమాన్ని చాటుకుంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీ సెంటర్లోని బిల్‌బోర్డ్‌లపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని రామ్ చరణ్ సన్నివేశాలను ప్రదర్శిస్తూ హల్చల్ చేశారు.
ఇవి కూడా చదవండి