లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నిర్వహణ...అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-06-07T14:23:20+05:30 IST

జిల్లాలోని గంపలగూడెం మండలంలో లింగాల గ్రామంలో మెడికల్ షాప్‌పై ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నిర్వహణ...అధికారుల తనిఖీలు

ఎన్టీఆర్: జిల్లాలోని గంపలగూడెం మండలంలో లింగాల గ్రామంలో మెడికల్ షాప్‌పై ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఔషధ నియంత్రణ విభాగం ఏడీ అనిల్ కుమార్, నందిగామ, గుడివాడ డ్రగ్ ఇన్స్పెక్టర్లు సురేష్ కుమార్, బాలు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు జరిగాయి. మూడేళ్లుగా లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న సుమారు లక్ష రూపాయల విలువైన 98 రకాల మందులు, శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని ఆర్.ఎం.పి వైద్యునిగా గ్రామంలో వైద్య సేవల్ని అందిస్తూ ప్రభుత్వ నిబంధనలను పట్టకుంచుకోని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

Updated Date - 2022-06-07T14:23:20+05:30 IST