ఎన్టీఆర్: జిల్లాలోని తిరువూరు ఇండోర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఆర్డీవోగా వైవి. ప్రసన్న లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్డీఓ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపై ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే రక్షణనిధి, ఆర్డీవో,అధికారులు మొక్కలు నాటారు. సర్వమత ప్రార్థనల అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆర్డీవో ఛాంబర్‌ను ఎమ్మెల్యే రక్షణనిధి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు, ఏ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలాల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి