ఎన్టీఆర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2022-01-19T04:20:29+05:30 IST

ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కర్నూలు నగరంలోని తన నివాసంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి
కర్నూలులో నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 18: ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కర్నూలు నగరంలోని తన నివాసంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ బీసీ సెల్‌ నాయకులు మహేష్‌గౌడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న, ఐటీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గట్టు తిలక్‌, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రాజుయాదవ్‌, ఇతర నాయకులు కృష్ణయ్య, ప్రకాష్‌, బొగ్గుల రాజశేఖర్‌, జలీల్‌బాషా, కిరణ్‌శెట్టి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


నగరంలో తెలుగు యువత నగర అధ్యక్షుడు జయకృష్ణతో పాటు తెలుగు మహిళ కమిటీ నాయకులు కిరణ్మయి ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు నగరంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ కర్నూలు నియోజకవర్గం ఇన్‌చార్జి టీజీ భరత్‌ చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీధర్‌, తెలుగు మహిళ నాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


డోన్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. డోన్‌లో టీడీపీ జెండాను ఎగురవేద్దామని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి విజయభట్టు, పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మన్నె గౌతమ్‌రెడ్డి, కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ రేగటి రామ్మోహన్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, దేవరబండ వెంకటనారాయణ, గంధం శ్రీనివాసులు, రంజిత్‌ కిరణ్‌, ఆర్‌ఈ నాగరాజు, ఆంజనేయగౌడు, ఆలా మల్లికార్జున రెడ్డి, ప్రజా వైద్యశాల మల్లికార్జున, చిట్యాల రఘు, ఉడుములపాడు సర్పంచ్‌ అనురాధ, మధుసూదన్‌ రెడ్డి, మిద్దెపల్లి గోవిందు తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మరి సుధాకర్‌, గోసానిపల్లె మల్లయ్య, జయన్న యాదవ్‌, బాలకృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు హుశేన్‌పీరా పాల్గొన్నారు. 


గూడూరు: గూడూరు పట్టణంలోని వీరభద్ర స్వామి కల్యాణ మండపంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ప్రభాకర్‌ హాజరయ్యారు. టీడీపీ మండల అఽధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి దండు సుందర్‌రాజు, సీనియర్‌ నాయకులు విజయ రాఘవ రెడ్డి, సలీం, తులసీకృష్ణ, మన్నన్‌బాషా, మదార్‌ సాహెబ్‌, నాగరత్నరావు, రవి, పెంచికలపాడు చిన్న గిడ్డయ్య, మునగాల గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


‘ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి’


కర్నూలు(అగ్రికల్చర్‌): నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయనకు ఘన నివాళి అర్పించారు. గ్రామ గ్రామాన ఎన్టీరామారావు చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేశారు. టీడీపీ 14 నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి టీజీ భరత్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్‌ వద్ద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. తర్వాత కలెక్టరేట్‌ వద్దకు వచ్చి మహాత్మాగాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమిశెట్టి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పార్టీని స్థాపించి 9 నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి అఖండ విజయం సాధించారని గుర్తు చేశారు. అణగారిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీ రామారావు మరణించి 26 ఏళ్లయినా కేంద్ర పాలకులు ఆయనకు భారతరత్న ఇవ్వకపోవడమం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతియడమేనన్నారు. టీజీ భరత్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌, నంద్యాల పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పార్వతమ్మ, తెలుగు యువత కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు అబ్బాస్‌, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, మంచాలకట్ట భాస్కర్‌ రెడ్డి, జేమ్స్‌, తిరుపాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


‘తెలుగు జాతి కీర్తిని పెంచిన ఎన్టీఆర్‌’ 


కల్లూరు:  తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు దివంగత నందమూరి తారక రామారావు అని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని పురస్కరించుకుని మాధవనగర్‌లోని గౌరు నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. గౌరు వెంకట రెడ్డి మాట్లాడుతూ రైతంగాం సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుగంగ ప్రాజెక్టును నిర్మించి భూములను సస్యశ్యామలం చేయడమే కాకుండా.. పలు జిల్లాలకు తాగునీరు అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పటేల్‌ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన ధీశాలి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో స్థానం కల్పించి, ఆయా వర్గాలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. తెలుగు మహిళ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత పాణ్యం అధ్యక్షుడు గంగాధర్‌గౌడు, బాల వెంకటేశ్వరరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ యాదవ్‌, రామాంజినేయులు, శేఖర్‌ చౌదరి, వాకిటి మాదేష్‌, క్యాతూరు మధు, దొడ్డిపాడు బాషా, పెద్దకొట్టాల రంగారెడ్డి, బజారన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-19T04:20:29+05:30 IST