Abn logo
Jul 13 2020 @ 12:26PM

తొందరపడుతున్న ఎన్టీయార్, చరణ్?

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే మరో రెండు వారాల్లో `ఆర్ఆర్ఆర్` సినిమా విడుదల కావాల్సింది. తొలుత ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే అనుకున్నట్టుగా షూటింగ్ జరగకపోవడంతో 2021 జనవరి 8కి వాయిదా వేశారు. కరోనా కారణంగా మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడడం లాంఛనంగానే కనిపిస్తోంది. దీంతో ఎన్టీయార్, రామ్‌చరణ్ కాస్త అసంతృప్తితో ఉన్నారట. 


ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` కోసం ఎన్టీయార్, చెర్రీ రెండేసి సంవత్సరాలు కేటాయించారు. మరో సంవత్సరం కూడా కేటాయించక తప్పేలా లేదు. మరోవైపు వీరిద్దరి కోసం వేరే దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో `ఆర్ఆర్ఆర్` షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయమని రాజమౌళిని కోరుతున్నారట. 2021 వేసవి సమయానికైనా షూటింగ్‌ను పూర్తి చేసి తమను రిలీవ్ చేయమని అడుగుతున్నారట. `ఆర్ఆర్ఆర్` విడుదలకు ముందే వేరే సినిమాలను ప్రారంభించాలని ఇద్దరూ భావిస్తున్నారట. 

Advertisement
Advertisement
Advertisement