NTR ఫ్యాన్స్ ఆధ్వర్యంలో Americaలో నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-05-02T14:12:48+05:30 IST

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వర్జీనియాలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

NTR ఫ్యాన్స్ ఆధ్వర్యంలో Americaలో నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు సన్నాహాలు

ఎన్నారై డెస్క్: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వర్జీనియాలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తారకరామారావు శతజయంతి వేడుకల ప్రారంభోత్సవంతో తెలుగింటి ఆడపడుచులు, అన్నదమ్ముళ్లు స్వాగతం పలుకుతూ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. MICHAEL & SON SPORTSPLEX AT DULLES వేదికగా మే 28న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు జరగనున్న వేడుకలకు కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యూఎస్‌ఏలోని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సహకారంతో ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం https://bit.ly/ntr-cpr లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా.. అన్నగారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పలు క్యారెమ్స్, చెస్, క్రికెట్, వాలీ బాల్, త్రో బాల్ క్రీడల తో పాటు సంగీత విభావరి, అన్నగారి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి కూడా అందజేయనున్నట్లు చెప్పారు. 











Updated Date - 2022-05-02T14:12:48+05:30 IST