ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

ABN , First Publish Date - 2022-01-19T06:24:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
నర్సీపట్నంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నాయకులు

రాష్ట్రపభుత్వానికి మాజీ మంత్రి అయ్యన్న వినతి

26వ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు


నర్సీపట్నం, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌ ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా పెట్టారని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి, నాయకులు బోళెం రాంప్రసాద్‌, చింతకాయల రాజేశ్‌, నేతల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


నాతవరం: మండల కేంద్రంలోని ఎన్‌.టి.రామారావు విగ్రహానికి జడ్పీటీసీ మాజీ సభ్యుడు కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు ఎన్‌.విజయ్‌కుమార్‌, సింగంపల్లి సన్యాసిదేముడు పూలలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీ యుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయ కులు కూండ్రపు సత్యనారాయణ, ఎన్‌.వెంకటరమణ, వి.చిట్టిబాబు, మాణిక్యం, ఇటంశెట్టి సీతారామ్మూర్తి, దివాణం, పైల సూరిబాబు, శెట్టి లోవ, మల్లేశ్వరరావు, పారుపల్లి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


గొలుగొండ/ కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలంలోని పలుగ్రామాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహా లకు టీడీపీ నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్‌, సర్పంచ్‌లు ఆదపురెడ్డి గోపాలకృష్ణ, యలమంచిలి నూకరత్నం, మాజీ సర్పంచులు కామిరెడ్డి రామన్న, సుర్ల బాబ్జీ, నాగేశ్వరరావు, కొలగాని రామారావు, ఎంపీటీసీ మాజీ సభ్యులు చింతల నారాయణమూర్తినాయుడు, గొంప రమణమ్మ, నాయకులు గొంప వాసు, బొడ్డు జమీలు, బొలిశెట్టి పాపారావు, బొప్పన ప్రసాద్‌, బుజ్జి, సన్నిబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. 


మాకవరపాలెం: మండలంలోని తామరం, తూటిపాల, రామన్నపాలెం, బయ్యవరం, లచ్చన్నపాలెం తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు రుత్తల శేషుకుమార్‌, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు అల్లు రామునాయుడు, రాచపల్లి ఎంపీటీసీ సభ్యుడు రుత్తల యర్రాపాత్రుడు, నాయకులు జోగిపాత్రుడు, కోసూరు శ్రీనివాసరావు, గంగిరెడ్ల నాగరాజు, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T06:24:17+05:30 IST