Abn logo
Jun 6 2020 @ 17:43PM

అప్పుడు తారక్... ఇప్పుడు బన్నీ

'అల వైకుంఠపురములో' టాలీవుడ్‌లో ఎంత భారీ సక్సెస్ సాధించిందో మనకు తెలిసిందే. మరి అలాంటి సూపర్ హిట్‌ని ఏదో ఒక భాషలో రీమేక్ చేయకుండా ఉంటారా? కానీ, కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం అన్ని సినిమా రంగాలు తాత్కాలికంగా మూతపడ్డాయి.


అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ గ్లామర్ ప్రపంచం మెల్లగా కోలుకుంటుండటంతో 'అల వైకుంఠపురములో' సినిమా రీమేక్ చర్చలు బాలీవుడ్‌లో జోరుగా జరుగుతున్నాయట. హీరోలు ఎవరంటూ కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం బీ-టౌన్‌లో యూత్‌‌ఫుల్ మూవీస్‌కి కేరాఫ్‌ అడ్రస్ కార్తీక్ ఆర్యన్. ఇతని సినిమాలు కుర్రాళ్లకే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగానే నచ్చుతుంటాయి. 


అందుకే కార్తీక్ ఆర్యన్‌తో 'అల వైకుంఠపురములో' రీమేక్ చేయాలనుకున్నారు మొదట్లో. కానీ, ఇప్పుడు అనూహ్యంగా రణవీర్ లాంటి స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. బన్నీ చేసిన పాత్ర ఈ బాలీవుడ్ 'బాజీరావ్' చేస్తాడట. సుశాంత్ క్యారెక్టర్‌లో కార్తీక్ ఆర్యన్ కనిపించవచ్చు అంటున్నారు. 


'అల వైకుంఠపురములో' రీమేక్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ గతంలోనూ రణవీర్ మన తెలుగు సినిమా ఒకటి రీమేక్ చేశాడు. 'సింబా' పేరుతో ఈ టాలెంటెడ్ స్టార్ నటించిన సినిమా... ఎన్టీఆర్ 'టెంపర్'కి హిందీ వర్షన్! అంతే‌కాదు, 'అర్జున్ రెడ్డి' రీమేక్ కూడా మొదట రణవీర్ వద్దకే వెళ్లింది. కానీ, ఆయన ముందుకు రాకపోవటంతో షాహిద్ కపూర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడిపోయింది! మరి ఈ మధ్య తెలుగు చిత్రాలు వరుసగా బాలీవుడ్‌లో సూపర్‌ హిట్స్ అవుతున్నాయి కాబట్టి 'అల వైకుంఠపురములో' కూడా రణవీర్ రీమేక్ చేస్తాడా? వేచి చూడాల్సిందే. 


Advertisement
Advertisement
Advertisement