Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 13:37:25 IST

#NTR31: బర్త్ డే పోస్టర్‌తో అంచనాలు పీక్స్..

twitter-iconwatsapp-iconfb-icon
#NTR31: బర్త్ డే పోస్టర్‌తో అంచనాలు పీక్స్..

ఈరోజు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) పుట్టినరోజు. అభిమానులతో పాటు ఎన్టీఆర్‌కి కూడా ఈ బర్త్ డే ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి భారీ హిట్ అందుకొని పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సాధించిన తర్వాత వచ్చిన బర్త్ డే కావడం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వచ్చేశాయి. నిన్ననే ఎన్టీఆర్ 30 (NTR 30)వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. కొరటాల శివ (koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 నుంచి  తారక్‌ (Tarak)ను రివీల్ చేయకుండానే.. పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో తన పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో వీడియో ద్వారా హింట్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ 31 (NTR 31) చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ కూడా వచ్చేసింది. 'కేజీయఫ్' (KGF) సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారని గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా కన్‌ఫర్మ్ చేశారు. కానీ, దీనికి సంబంధించిన పోస్టర్ గానీ, అధికారిక ప్రకటన గానీ రాలేదు. ఎట్టకేలకు ఈరోజు తారక్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ తారక్ లుక్‌తో ప్రకటించారు. 

ఇందులో ఎన్టీఆర్ గుబురు గడ్డం కోరమీసంతో మోస్ట్ వైలెంట్‌గా మహా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. చెప్పాలంటే ఆయన కెరీర్‌లో ఇటువంటి మేకోవర్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. ఇక ఈ పోస్టర్‌లో.. 'రక్తంతో తడిసిన నేల మాత్రమే గుర్తుకు వస్తుంది.. ఆయన నేల.. ఆయన పాలన. అయితే, అది కచ్చితంగా ఆయన రక్తం కాదు'.. అని మేకర్స్ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే కేజీఎఫ్ సిరీస్ కంటే రెండింతలు హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఎన్టీఆర్ 31 రూపొందనుందని అర్థమవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను 2023, ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International