‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత యన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికే పూర్తిగా అంకితమైపోయాడు తారక్. ఈ పాటికి బాక్సాఫీస్ ను ఏల వల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త డేట్ ను నిర్మాతలు అనౌన్స్ చేసేవారకూ అభిమానులు ఆగవల్సిందే. దీని వల్ల ఈ పాటికే మొదలవ్వాల్సిన కొరటాల దర్శకత్వంలో యన్టీఆర్ 30 షూటింగ్ డిలే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సినిమాను ఈ ఏప్రిల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఈ విడుదల తేదీని ఎలాగూ మార్చుతారు. సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదలవుతుంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. కొరటాల కథను కూడా లాక్ చేశారని సమాచారం. యన్టీఆర్30 ఓ రివెంజ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. కొరటాల మార్క్ సామాజిక సందేశంతో మాస్ ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాల్ని ఇందులో మిళితం చేస్తున్నట్టు సమాచారం. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ యాక్షన్ సమపాళ్ళలో ఉంటాయట. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంపికకగా.. హీరోయిన్ వేటలో చిత్ర బృందం ఉందట. మరి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.