Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 26 May 2022 09:59:01 IST

NTR 30: కథలో కీలక మార్పులు..ఆలస్యంగా సెట్‌పైకి..?

twitter-iconwatsapp-iconfb-icon

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఎన్టీఆర్ (NTR) హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగానూ మేకర్స్ ప్రకటించారు. ఎన్టీఆర్ 30గా తెరకెక్కనున్న ఈ సినిమాని నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పణలో.. యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) పతాకంపై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar mikkilineni), హరికృష్ణ.కె (K Harikrishna) నిర్మిస్తున్నారు. అయితే, ఇటీవల ప్రకటించిన సమయంలో జూన్ నుంచి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 

అయితే, తాజా సమాచారం మేరకు మరో రెండు నెలలవరకు ఎన్టీఆర్ 30 సెట్స్‌పైకి రాకపోవచ్చునని తెలుస్తోంది. దీనికి కారణం ఇప్పుడు కథలో కొన్ని కీలక మార్పులను చేస్తుండటమేనట. ఎన్టీఆర్ కూడా కథా చర్చల్లో పాల్గొంటున్నారని, దర్శకుడు కొరటాల శివతో కథ గురించి చర్చిస్తూ పలు మార్పులు సూచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొరటాల కూడా ఆచార్య ప్రభావంతో మరింత సమయం కేటాయించైనా ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తర్వాతే సెట్స్‌లో అడుగుపెట్టాలని డిసైడయ్యారట.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ - కొరటాల చిత్రం ఆగస్టు నుంచి షూటింగ్ మొదలవనుందని తెలుస్తోందని..అనుకున్న విధంగా కథ సిద్ధం కాకపోవడం వల్లే ముందు అనుకున్న ప్లాన్ మర్చుకున్నట్టు సమాచారం. దీనిపై ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ మాత్రం చిత్రబృందం నుంచి రాలేదు. కాగా, ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్ నుంచి మొదలవబోతుంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement