ఎన్టీపీసీ త్రైమాసిక లాభం రూ. 2,048 కోట్లు

ABN , First Publish Date - 2021-08-02T01:31:45+05:30 IST

ప్రభుత్వాధీనంలోని పవర్ సంస్థ ఎన్‌టీపీసీ... జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 2,948.94 కోట్లుగా నమోదైంది.

ఎన్టీపీసీ త్రైమాసిక లాభం రూ. 2,048 కోట్లు

హైదరాబాద్ : ప్రభుత్వాధీనంలోని పవర్ సంస్థ ఎన్‌టీపీసీ...  జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 2,948.94 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం గతేడాది ఇదే సమయంలో ఉన్న రూ. 26,794.68 కోట్ల నుంచి పెరిగి రూ. 30,390.60 కోట్లకు చేరుకుంది. దేశీయంగా ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన బాండ్ల జారీ ద్వారా రూ. 18 వేల కోట్లను సమీకరించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌టీపీసీ వెల్లడించింది. 


ఎన్‌టీపీసీ స్థూలంగా జూన్ త్రైమాసికంలో 71.74 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. కాగా... గతేడాది ఇదే సమయంలో  6,0.18 బిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఎన్‌టీపీసీ ప్లాంట్లకు దేశీయ బొగ్గు సపరఫరా జూన్ త్రైమాసికంలో 45.81 మిలియన్ టన్నులు కాగా, గతేడాది ఇదే సమయంలో  45.81 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా జరిగింది. పవర్ ప్లాంట్ ఆధారంగా బొగ్గు వినియోగం జూన్ త్రైమాసికంలో 68.22 శాతం నుంచి 69.68 శాతానికి పెరిగింది. కిందటి సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యూనిట్ కనీస పవర్ టారిఫ్... యూనిట్‌కు రూ. 3.73 గా ఉంది. ఇది గతేడాది యూనిట్‌కు రూ. 3.98గా ఉంది. 

Updated Date - 2021-08-02T01:31:45+05:30 IST