దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీ రామారావు

ABN , First Publish Date - 2022-05-29T04:36:43+05:30 IST

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సైనికుడిలా కృషిచేసి తెలుగోడి ఖ్యాతిని దేశం గర్వించే విధంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని టీడీపీ త్రీమ్యాన్‌ కమిటీ నియోజకవర్గ సభ్యులు ఓంప్రకాష్‌, గోపాల్‌ పేర్కొన్నారు.

దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీ రామారావు
నర్వలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

- ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు  

- నివాళి అర్పించిన నాయకులు

నారాయణపేట, మే 28 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సైనికుడిలా కృషిచేసి తెలుగోడి ఖ్యాతిని దేశం గర్వించే విధంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని టీడీపీ త్రీమ్యాన్‌ కమిటీ నియోజకవర్గ సభ్యులు ఓంప్రకాష్‌, గోపాల్‌ పేర్కొన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అ నంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యాబన్న, కనకప్ప, వద్ది నారాయణ, వీరన్న, భీమన్న, కిష్టప్ప, ప్రభాకర్‌, వెంకటయ్య, నర్సిములు పాల్గొన్నారు. 

మక్తల్‌ : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకొని శనివారం పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షుడు మదుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. టీడీపీ హయాంలోనే పేదలకు మేలు జరిగిందన్నారు. పార్టీ పెట్టిన అనతికాలంలోనే ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించారన్నారు. అనంతరం పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. టీడీపీ నాయకులు మోహన్‌ రెడ్డి, బాల్‌రెడ్డి, బండారి భీమేష్‌, ఆనంద్‌, రమేష్‌, చంద్రశేఖర్‌, నరేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

నర్వ : దివంగత మాజీ ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారక రామారావు జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహానికి అభిమానులు పూలమాల వేసి నివాళి అర్పించి ఆయన సేవలను కొని యాడారు. కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి, వెంకట్‌ రాంరెడ్డి, డా.వెంకటేశ్వర్‌ రావు, శ్రీనివాస్‌రావు, ఎండీ రఫీ, కుర్మారెడ్డి, గుడిసె వెంకటయ్య, పల్లె శేఖర్‌, నరసింహ గౌడ్‌, శ్రీనివాస్‌సాగర్‌ పాల్గొన్నారు.

మాగనూరు : మండల కేంద్రంలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను టీడీపీ నాయకులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్‌ మాట్లాడుతూ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల అభివృ ద్ధికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు.  రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.  మాగనూరు పట్టణ అధ్యక్షుడు నరేష్‌, దండు రవి, బాల్‌దాస్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

దామరగిద్ద : ఒంగోలులో చేపట్టిన మహానా డుకు దామరగిద్ద మండల టీడీపీ మండల నాయకులు తరలివెళ్లారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. టీడీపీ జిల్లా నాయకులు రాములుయాదవ్‌, మండలాధ్యక్షుడు తిమ్మారెడ్డి, నాయకులు రాములు, మొగులప్ప పాల్గొన్నారు.

కోస్గి : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కోస్గి శివాజీ చౌరస్తాలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.  టీడీపీ పార్లమెంట్‌ కమిటీ అధికార ప్రతినిధి డీకే.రాములు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అంజిలయ్య, జిల్లా కార్యదర్శి బొంపల్లి అచ్చుతారెడ్డి, మోహన్‌జీ, అమృతారెడ్డి, మహిమూద్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాములు పాల్గొన్నారు. 





Updated Date - 2022-05-29T04:36:43+05:30 IST