ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాస

ABN , First Publish Date - 2022-04-21T00:22:01+05:30 IST

ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాసగా మారింది. మూడేళ్లుగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టకపోవడంతో నేతలను కార్యకర్తలు నిలదీశారు

ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాస

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాసగా మారింది. బల్లలు, కుర్చీలు ఎన్‌ఎస్‌యూఐ నేతలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టకపోవడంతో నేతలను కార్యకర్తలు నిలదీశారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో వైస్‌ ప్రెసిడెంట్‌ చందనారెడ్డి వాగ్వాదానికి దిగారు. యూనివర్సిటీలలో ఎలాంటి కమిటీలు లేకుండా చేశారని ఆరోపించారు. యూనివర్సిటీల్లో కమిటీలు లేకుండా వెంకట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన అభిప్రాయాలు చెబితే బెదిరిస్తున్నారంటూ మీడియా ముందు చందనా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెబుతుంటే ప్రెసిడెంట్ మనుషులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు చెబుతుంటే కొందరు మీసాలు మెలేస్తున్నారని తెలిపారు. చందనా మీడియాతో మాట్లాడుతుండగా వెంకట్ అనుచరులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-04-21T00:22:01+05:30 IST