ఆయుధాల రూపకల్పనలో ఎన్‌ఎస్‌టీఎల్‌ కీలకపాత్ర

ABN , First Publish Date - 2022-05-20T04:38:59+05:30 IST

ఆయుధాల రూపకల్పనలో ఎన్‌ఎస్‌టీఎల్‌ కీలకపాత్ర పోషిస్తోందని ఎన్‌ఎస్‌టీఎల్‌ అఫీషియేటింగ్‌ డైరెక్టర్‌ బీవీవీఎస్‌ కృష్ణకుమార్‌ తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో సమాకాలీన పరిశోధనపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆయుధాల రూపకల్పనలో ఎన్‌ఎస్‌టీఎల్‌ కీలకపాత్ర
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కృష్ణకుమార్‌

సమకాలీన పరిశోధనలపై అవగాహన సదస్సులో అఫీషియేటింగ్‌ డైరెక్టర్‌ కృష్ణకుమార్‌  


గోపాలపట్నం, మే 19: ఆయుధాల రూపకల్పనలో ఎన్‌ఎస్‌టీఎల్‌ కీలకపాత్ర పోషిస్తోందని ఎన్‌ఎస్‌టీఎల్‌ అఫీషియేటింగ్‌ డైరెక్టర్‌ బీవీవీఎస్‌ కృష్ణకుమార్‌ తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో సమాకాలీన పరిశోధనపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత నావికాదళానికి ఉత్పత్తుల్ని అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో నీటి అడుగున వినియోగించే ఆయుధాల రూపకల్పన, అభివృద్ధిలో ఎన్‌ఎస్‌టీఎల్‌ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్‌ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థలు పరస్పర ఆధారిత ఉప వ్యవస్థలను కలిగి ఉన్నాయని, విద్యావేత్తల సహాయంతో సంబంధిత అంశాల పరిజ్ఞానం సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఆర్‌బీ పాత్ర, సంస్థాగత నిర్మాణంపై శాస్త్రవేత్త అశోక్‌ యాదవ్‌ ప్రసంగించారు. సముద్ర నిఘా, బయోమెట్రిక్‌ అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్స్‌ అభివృద్ధికి సంబంధించి ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కృష్ణన్‌ కుట్టి పలు కీలక అంశాలను వివరించారు. అనంతరం సమకాలీన నావికాశాస్త్రాలు, సాంకేతికతలను సంబంధించి పలు అంశాలపై చర్చాగోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఎన్‌.ప్రభు (ఐఐటీ ముంబయి), డాక్టర్‌ డీడీ ఎబెనెజర్‌ (సీయూఎస్‌ఏటీ, కొచ్చి), డాక్టర్‌ సీవీఏ ప్రసాదరావు (సీనియర్‌ సైంటిస్ట్‌, డీఆర్‌డీవో), సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.శ్రీనివాసకుమార్‌, డాక్టర్‌ మను కోరుల్లా, డాక్టర్‌ అబ్రహం వర్గీస్‌, ఆర్‌.శ్రీహరి, పలు విద్యాసంస్థలు, నౌకాదళ సంస్థలకు చెందిన 67 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T04:38:59+05:30 IST