Abn logo
Sep 24 2021 @ 23:21PM

మహిళా కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం

ర్యాలీ నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులు

అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, అధ్యాపకులు

విశాఖపట్నం, సెప్టెంబరు 24: పాత జైలు రోడ్డులోని విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.శోభారాణి మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను వివరించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రతినిధులు పుష్పలత, అనురాధ, సుధ, పద్మావతి, వెంకటమ్మ, విద్యార్థినులు పాల్గొన్నారు.