రాజధాని పోరుకు ఎన్‌ఆర్‌ఐల దన్ను

ABN , First Publish Date - 2020-11-01T10:20:09+05:30 IST

రైతుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన రాజధాని అమరావతిని నిలుపుకొనేందుకు, ఇక్కడ రైతులు చేస్తున్న ఉద్యమానికి దన్నుగా నిలిచేందుకే

రాజధాని పోరుకు ఎన్‌ఆర్‌ఐల దన్ను

  • వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అమరావతి మహిళలు

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): రైతుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన రాజధాని అమరావతిని నిలుపుకొనేందుకు, ఇక్కడ రైతులు చేస్తున్న ఉద్యమానికి దన్నుగా నిలిచేందుకే ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. మూడు రాజధానుల ఆలోచనను తీవ్రంగా నిరసిస్తూ, రైతుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో జయరాం కోమటి, డాక్టర్‌ శ్రీనివాసరావు కొడలి, అమరాతి రైతులు, దళిత, జేఏసీ నేతలు మాట్లాడారు. సమావేశంలో nrisforamaravati.org వెబ్‌సైట్‌ను పోలీసు లాఠీలను ఎదురొడ్డి నిలిచిన మహిళలు శ్రీలక్ష్మి, పిచ్చమ్మలు ప్రారంభించారు. రాజధానిని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు వక్తలు పేర్కొన్నారు. సమావేశలో పాల్గొన్న పలువురు ఎన్‌ఆర్‌ఐలు రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 

Updated Date - 2020-11-01T10:20:09+05:30 IST