రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2022-05-23T16:04:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ ల పాత్ర ముఖ్యమైనదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అమెరికాలోని ఫిడలెల్ఫియాలో ఆదివారం సాయంత్రం మందలపు రవి కుమార్ అధ్యక్షతన ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం జరిగింది.

రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ ల పాత్ర ముఖ్యమైనదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అమెరికాలోని ఫిడలెల్ఫియాలో ఆదివారం సాయంత్రం మందలపు రవి కుమార్ అధ్యక్షతన ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదే‌శ్‌లో టీడీపీ విజయానికి ఎన్ఆర్ఐలు విశేషంగా కృషిచేస్తున్నారన్నారు. ‘రాష్ట్రంలో తెలుగుదేశం పాలనతోనే సుస్థిరాభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. టీడీపీ విజయానికి అందరం తపన పడుతున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజలకు మంచి, చెడు గురించి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. తెలుగుదేశం విజయానికి ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని గోరంట్ల బుచ్చయయ చౌదరి ప్రసంగించారు. 


మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత విధ్వంస పాలన పట్ల ప్రజలు విరక్తి చెందారన్నారు. ‘చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టే సత్తా టీడీపీకే ఉంది. తెలుగుదేశం విజయానికి ప్రవాసాంధ్రులు అండగా ఉండాలి. రాష్ట్రం కోసం, భవిష్యత్ కోసం, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం ఎన్ఆర్ఐ టీడీపీ పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేసి చైతన్యవంతులను చేయాలి’ అని మన్నవ సుబ్బారావు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రవి పొట్లూరి, భాను మాగులూరి, సునీల్ కోగంటి, హరి బుంగతావుల, సతీష్ చుండ్రు, ఫణి, హేమంత్, వేణు, అశోక్ దండమూడి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T16:04:01+05:30 IST