Social Media Laws: ప్రవాసులూ అక్కడున్న ఈ ఐదు రూల్స్ గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-07-25T14:33:30+05:30 IST

సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం. సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు Social Media రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే..

Social Media Laws: ప్రవాసులూ అక్కడున్న ఈ ఐదు రూల్స్ గురించి మీకు తెలుసా?

ఎన్నారై డెస్క్: సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం. సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు Social Media రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే దీని వల్ల మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాపించకుండా కఠిన చట్టాలను తీసుకొచ్చాయి. కానీ మనం ప్రస్తుతం మాట్లాడుకోబోయేది మాత్రం యూఏఈలోని చట్టాల గురించి. 


India నుంచి ప్రతి రోజు వందలాది మంది ఉపాధి, ఉద్యోగం కోసం యూఏఈ (UAE) వెళ్తుంటారు. ఇలా వెళ్లే వారిలో చాలా మందికి అక్కడ ఉన్న చట్టాలపై అవగాహన ఉండదు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం అంతా నిజమేనని నమ్మి, వాటిని ఇతర మద్యామాల్లో పోస్టులు చేస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఐదు రూల్స్‌పై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ప్రవాసులతోపాటు యూఏఈ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లు సైతం వాటిని తప్పక తెలుసుకోవాలి. ఈ క్రమంలో అక్కడ అమలవుతున్న రూల్స్‌ను ఓసారి పరిశీలిస్తే..


  • ఇస్లాం మతంతోపాటు యూఏఈలో గుర్తింపు పొందిన ఏ మతాన్ని కూడా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవు. మతాలను డీఫేమ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 2,50,0000 నుంచి ఒక మిలియన్ దిర్హమ్‌ల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. 

  • మహిళలు, చిన్న పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌ అంటే మానవ అక్రమ రవాణా, పోర్నోగ్రఫీ, వ్యభిచారం వంటి వాటికి సంబంధించిన పోస్టులు పెట్టడం ఆర్టికల్ 32-34ప్రకారం నేరం. దీనికి శిక్షగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 2,50,0000 నుంచి ఒక మిలియన్ దిర్హమ్‌ల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. 

  • యూఏఈ ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు. అలాగే UAE, ఇతర దేశాల రాజకీయ వ్యవస్థలను అవమాన పరుస్తూ పోస్టులు పెట్టడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి తక్కువలో తక్కువ కనీసం ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే 1,50,000-5,00,000 దిర్హమ్‌ల ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. 

  • UAE సంస్కృతి, వారసత్వంపై పుకార్లు, తప్పుడు వార్తలను పోస్ట్ చేయడం నేరం. అలాగే ప్రభుత్వం లేదా నేర పరిశోధనలకు సంబంధించిన గోప్యమైన విషయాలను ఎట్టి పరిస్థితుల్లో Social Media‌లో పోస్ట్ చేయవద్దు.

Updated Date - 2022-07-25T14:33:30+05:30 IST