భారత్‌కు భారీగా గల్ఫ్ NRIల నిధులు..! కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-07-01T22:36:28+05:30 IST

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత ఎన్నారైలకు(NRI) లాభిస్తోంది. గల్ఫ్‌లోని(Gulf) ప్రవాసీ భారతీయులు(NRIs) తమ సంపాదనను పెద్ద ఎత్తున స్వదేశానికి తరలిస్తున్నారు.

భారత్‌కు భారీగా గల్ఫ్ NRIల నిధులు..! కారణం ఇదే..

ఎన్నారై డెస్క్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత ఎన్నారైలకు(NRI) లాభిస్తోంది. గల్ఫ్‌లోని(Gulf) ప్రవాసీ భారతీయులు(NRIs) తమ సంపాదనను పెద్ద ఎత్తున స్వదేశానికి తరలిస్తున్నారు. కొందరు లోన్లు కూడా తీసుకుని తమ కుటుంబీకులకు డబ్బులు పంపిస్తున్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.11గా నమోదైంది. భవిష్యత్తులో ఇది రూ.80ల మార్కును దాటొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక గల్ఫ్‌ దేశాల కరెన్సీలు కూడా డాలర్ విలువతో ముడిపడిన కారణంగా అక్కడి కరెన్సీ ఇక్కడి వారిపై కనకవర్షం కురిపిస్తోంది. స్వదేశానికి నిధులు బదిలీ చేసేందుకు గల్ఫ్ ఎన్నారైలు అక్కడి ఫారిన్ ఎక్సేంజ్ కార్యాలయాలు, బ్యాంకులకు పోటెత్తుతున్నారు. 


ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం.. దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం కూడా ఈ ట్రెండ్‌కు తోడైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూపాయి విలువ సుమారు 4.2 శాతం పడిపోయింది. 2020 మార్చి త్రైమాసికం తరువాత.. ఇంతటి పతనం నమోదు కావడం ఇదే తొలిసారి. రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంకు తన విదేశీ కరెన్సీ నిల్వలను వినియోగిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ భౌగోళిక ఆర్థిక పరిస్థితులు దేశీ కరెన్సీని ప్రభావితం చేస్తున్నాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-01T22:36:28+05:30 IST