ఎన్నికల్లో ఓటేసి.. ఆదర్శంగా నిలిచిన ఎన్నారైలు!

ABN , First Publish Date - 2021-04-08T02:35:06+05:30 IST

ఎన్నికల సమయంలో పక్కనే ఉన్న పోలింగ్ బూత్‌లో ఓటు వేయడాని కూడా కొందరు బద్దకిస్తుంటారు. కానీ కొంత మంది ఎన్నారైలు వేల కిలోమీటర్ల దూరం నుంచి స్వస్థలాలకు వచ్చి.. మంగళవారం

ఎన్నికల్లో ఓటేసి.. ఆదర్శంగా నిలిచిన ఎన్నారైలు!

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో పక్కనే ఉన్న పోలింగ్ బూత్‌లో ఓటు వేయడాని కూడా కొందరు బద్దకిస్తుంటారు. కానీ కొంత మంది ఎన్నారైలు వేల కిలోమీటర్ల దూరం నుంచి స్వస్థలాలకు  వచ్చి.. మంగళవారం రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, అస్సాం, బెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


సింగపూర్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న 29ఏళ్ల సత్యశీలన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 20రోజుల ముందుగానే స్వస్థాలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఇష్టమని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణ కోసం పని చేస్తున్న ఓ పార్టీకి ఎన్నికల్లో మద్దతు పలికనట్టు చెప్పారు. కేరళకు చెందిన కే.ఎల్ గోపీ.. గత కొన్నేళ్లుగా దుబాయిలోనే నివసిస్తున్నారు. కాగా.. ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రోజు కేరళ చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-04-08T02:35:06+05:30 IST