రెండేళ్లలోనే సీన్ రివర్స్.. కోటిన్నర రూపాయలు పెట్టి కొనేందుకు కూడా సిద్ధమంటున్న NRI లు..

ABN , First Publish Date - 2021-09-17T23:22:48+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా అన్ని రంగాల్లో సీన్ రివర్స్ అయింది.

రెండేళ్లలోనే సీన్ రివర్స్.. కోటిన్నర రూపాయలు పెట్టి కొనేందుకు కూడా సిద్ధమంటున్న NRI లు..

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కారణంగా అన్ని రంగాల్లో సీన్ రివర్స్ అయింది. దాదాపు అన్ని రంగాలను కరోనా కోలుకోని దెబ్బకొట్టింది. అటు విదేశాల్లో ఉంటున్న చాలా మంది భారతీయులు కూడా ఉద్యోగాలు పొగొట్టుకుని స్వదేశానికి రావాల్సిన పరిస్థితి దాపురించింది. కరోనాకు ముందు స్వదేశంలో ఇళ్ల కొనుగోలుపై అంతగా ఆసక్తి చూపని ఎన్నారైలు.. ఇప్పుడు ఏకంగా కోటిన్నర వెచ్చించైనా సొంత ఇంటి కలను నేరవేర్చుకోవాలని చూస్తున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు తారుమారు కావడంతో ఎప్పుడు స్వదేశానికి రావాల్సి ఉంటుందో తెలియని పరిస్థితి. దాంతో స్వదేశంలో ఓ లగ్జరీ ఇల్లు ఉంటే బావుంటుందని ఎన్నారైలు భావిస్తున్నారు. ఇంతకుముందు వారి ఆలోచన వేరేలా ఉండింది. ఒకవేళ ఇల్లు ఉన్న కిరాయికి ఇచ్చేసేవారు. 


ఇవి కూడా చదవండి..

American సెనేట్‌లో కీలక బిల్లు.. NRI పిల్లలకు భారీ మేలు!

గుడ్‌న్యూస్ చెప్పిన Kuwait.. ఆ రెండు రంగాల్లో జాబ్ చేస్తున్న వలసదారులకు..

ఇప్పుడు అలా కాదు ఒకవేళ స్వదేశానికి వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటే.. తమకు ఇక్కడ మంచి ఇల్లు ఉంటే బావుంటుందని ఆలోచిస్తున్నారు. దీనికోసం ఎంత భారీ మొత్తానైనా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు సర్వేలు చెబుతున్నాయి. స్వదేశంలో తమ సొంత వినియోగాల కోసం ఇళ్లను కొనుగోలు చేస్తున్నవారు భారీగా పెరిగారట. సీఐఐ-అనరాక్ కన్జూమర్ సెంటిమెంట్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇలా సొంత వినియోగాల కోసం ఆస్తులు కొనుగోలు చేస్తున్న ఎన్నారైలు 53 శాతంగా ఉంటే.. కేవలం పెట్టుబడిల రూపంలో పెడుతున్నవారు 47 శాతంగా ఉన్నారు. అదే కోవిడ్-19కు ముందు ఈ లెక్కలు 32%:68%గా ఉన్నాయి. అంటే.. రెండేళ్లలోనే సీన్ రివర్స్ అయింది. 


ఇక ముఖ్యంగా భారత్‌లోని 8 నగరాల్లో ఎన్నారైలు స్థిర ఆస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వే చెబుతోంది. బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై, చంఢీగఢ్, కొచ్చి, సురత్, అహ్మదాబాద్ నగరాల్లో ఇళ్ల కోసం ఎన్నారైలు భారీగా వెచ్చించడానికి రెడీ అవుతున్నారని సర్వే ద్వారా తెలిసింది. వీరిలో సుమారు 50 శాతం మంది ఎన్నారైలు లగ్జరీ ఇళ్ల కోసం చూస్తున్నారట. దీనికోసం ఏకంగా కోటిన్నర వరకు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని సమాచారం. అలాగే 32 శాతం మంది ప్రీమియం ఇళ్ల కోసం రూ.90లక్షల నుంచి రూ. 1.5కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 11 శాతం మంది మధ్య తరగతి ఇళ్ల కోసం రూ. 45-90లక్షల వరకు పెట్టేందుకు రెడీ అవుతుంటే.. మరో 7 శాతం మంది తమ తాహతకు తగ్గ ఇండ్ల కోసం వెతుకుతున్నట్లు సర్వే గణాంకాలు వెల్లడించాయి. 


అలాగే సర్వేలో మరికొన్ని విషయాలు కూడా తెలిశాయి. ఎన్నారైల నుంచి పెద్ద ఇళ్లకే భారీ డిమాండ్ ఉంది. సుమారు 48 శాతం మంది ఎన్నారైలు 3BHK(more than 1,500 sq. ft.) ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుంటే.. 28 శాతం మంది 2BHKకు ఓకే చెబుతున్నారు. ఇక 24శాతం మంది అయితే ఏకంగా 4BHK లేదా అంతకంటే పెద్దవైనా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 

Updated Date - 2021-09-17T23:22:48+05:30 IST