దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఎన్నారై టీఆర్ఎస్ నేతలు

ABN , First Publish Date - 2020-11-01T00:09:37+05:30 IST

దుబ్బాక సిటింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అ

దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఎన్నారై టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: దుబ్బాక సిటింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించబోతుందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విశ్వాసం వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా అటు క్షేత్రస్థాయిలో ఇటు సోషల్ మీడియా ద్వారా పార్టీ గెలుపునకు క్రియాశీలకంగా పని చేసినట్లు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధికే పట్టం కట్టబోతున్నట్లు గ్రామల్లోని ప్రజలు చెప్పారని ప్రచార బృందానికి నాయకత్వం వహిస్తున్న సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన చెప్పుకొచ్చారు.


బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలకు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని నాయకులు సృజన్ రెడ్డి చాడ, రమేష్, అశోక్ తెలిపారు. ఎన్నారైలు, వారి బంధుమిత్రులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని.. దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్ఎస్ నాయకులు రవి రేతినేని, సురేష్ బుడగం, రవి ప్రదీప్ పులుసు వెల్లడించారు. మైనారిటీ ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారని.. ప్రజలంతా కృతజ్జతతో టీఆర్ఎస్ వైపే ఉన్నారని అబ్దుల్ జఫర్ పేర్కొన్నారు. 



ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా పని చేసిన నవీన్ భువనగిరి మాట్లాడుతూ.. దుబ్బాకలో జరిగిన అభివృద్ధి గురించి లెక్కలతో సహా విస్తృతంగా  ప్రచారం చేసినట్లు చెప్పారు. ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ నాయకత్వంలోనే దుబ్బాక మరింత అభివృద్ధి చెందుతుందని కార్యదర్శి సత్య చిలుముల చెప్పారు. సోలిపేట సుజాతను లక్ష మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బ్యాలెట్‌పై మూడవ వరుసలోని కారు గుర్తుపై ఓటు వేయాలని దుబ్బాక ప్రజలకు విజ్జప్తి చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రచారానికి వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ బృందానికి సహకరించిన నాయకులకు, మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్జతలు చెప్పారు.  


Updated Date - 2020-11-01T00:09:37+05:30 IST