లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-07-27T18:24:18+05:30 IST

ఎన్నారై టీఆర్ఎస్ (NRI TRS) యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

లండన్: ఎన్నారై టీఆర్ఎస్ (NRI TRS) యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు "గిఫ్ట్ ఏ స్మైల్"లో భాగంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ కార్యవర్గ సభ్యులు యూకే NHSకి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దుసరి అధ్యక్షతన  నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరై రక్తదానం చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. పెట్టుబడుల కోసం ఒక ఋషి చేసిన యాగంలా ప్రపంచ దేశాల సదస్సులలో తెలంగాణ ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్లడం కేటీఆర్ పట్టుదలకు నిదర్శనం అన్నారు. ఆయన పట్టుదల చాలా గొప్పదని, ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌కి కేటీఆర్, యావత్ టీఆర్ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సంధర్భంగా అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని, అందరి సూచనలను తీసుకొని ముందుకు వెళ్తుందన్నారు. కాబట్టి ఎటువంటి సలహాలు సందేశాలు వున్నా వ్యక్తిగతంగా గానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, నేడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే తలమానికంగా నిలపడంలో కేటీఆర్ కృషి మరువలేనిదని చెప్పారు.


చివరగా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ప్రవాస బిడ్డ కేటీఆర్ వెంటే ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం లండన్‌లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు అశోక్ దూసరి, ఎన్నారై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్వైజర్ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్, కార్యదర్శులు సత్య చిలుముల, సృజన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సతీష్ రెడ్డి, గణేష్, నిఖిల్ పాల్గొన్నారు.



Updated Date - 2022-07-27T18:24:18+05:30 IST