ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్యర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

ABN , First Publish Date - 2020-06-03T01:03:10+05:30 IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్యర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

మనామా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. కొవిడ్ -19 నేపథ్యంలో  పని లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు అండగా నిలిచింది. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా, మానసికంగా కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రభుత్వాలు వీలైనంత సహాయం చేస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులు, సంస్థలు ఆపదలో ఉన్నవాళ్లకు వీలైనంత సహాయం చేస్తున్నాయి. ఈ ఆపద సమయంలో పేద ప్రజలను ఆదుకుంటున్న వారందరికీ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ధన్యవాదాలు తెలిపింది. ఎన్నారై సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు బోలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే పేద, ఆర్థికంగా వెనుకబడిన ఎన్నారైలకు ఉచిత క్వారంటైన్ సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎన్నారై సెల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 


ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఆభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు విజయపథంలో దూసుకెళ్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రైతుబంధు, బీమా, పింఛన్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి ఎన్నో జనరంజక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రజలందరూ ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ స్ఫూర్తితో, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రవాసులకు సహాయం చేస్తూ వారిలో మానసికస్థైర్యాన్ని నింపుతున్నామని  తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. 


కాగా.. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్ ,జనరల్ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, మగ్గిడిరాజేందర్, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్ రావు, బాల్కొండ దేవన్న, ఉత్కం కిరణ్ కుమార్, ఆకుల సుధాకర్, జాయింట్ సెక్రటరీ బొలిశెట్టి ప్రమోద్, తమ్మళ్ల వెంకటేష్, కొత్తూరు సాయన్న, కుమ్మరి రాజు కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నల్ల శంకర్, చిన్నవేన బాజన్న, కోట నడిపి సాయన్న, ఆకుల చిన్న బుచ్చయ్య, సొన్న గంగాధర్, తప్పి చిన్న గంగారాం, మొహమ్మెద్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-06-03T01:03:10+05:30 IST