వానరాలపై ఎన్నారై దాతృత్వం

ABN , First Publish Date - 2021-04-05T13:45:28+05:30 IST

వేసవిలో మూగజీవాలైన వానరాలకు నీరు, తిండి అందించడానికి మం డల కేంద్రానికి చెందిన ఓ ఎన్నారై ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. సుమారు 55 కిలోమీటర్ల పొడవునా నీటితొట్టెలు ఏర్పాటు చే

వానరాలపై ఎన్నారై దాతృత్వం

కాటారం, ఏప్రిల్‌ 4: వేసవిలో మూగజీవాలైన వానరాలకు నీరు, తిండి అందించడానికి మం డల కేంద్రానికి చెందిన ఓ ఎన్నారై ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. సుమారు 55 కిలోమీటర్ల పొడవునా నీటితొట్టెలు ఏర్పాటు చేయడమే కాకుండా టమాట పండ్లు, ఇతర కూరగాయలను ఆహారంగా అందించడానికి సం కల్పించారు. మండలంలోని గారెపల్లికి చెందిన తోట సురేష్‌ తన తండ్రి తోట శంకరయ్య జ్ఞాప కార్ధం భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వరకు 353(సీ) జాతీయరహదారి పక్కన నీటి తొట్లు ఏర్పాటు చేశారు. సురేష్‌ పదేళ్లుగా  అమెరి కాలో స్థిరపడ్డాడు. ఇటీవల స్వదేశం వచ్చిన ఆయన అటవీప్రాంతంలో కోతులు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి చలించిపోయారు. నీటి తొట్టెలను కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి ఆదివారం రహదారి పక్కన ఏర్పాటు చేయడమే కాకుండా వాటర్‌ ట్యాంకర్‌తో నీటిని నింపారు. వాహనదారులు, ప్రయాణికులు నీటి తొట్టెల్లో బాటిల్‌ నీటిని పోయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట సతీష్‌, చీమల రాజు, శ్రీధర్‌, రవికుమార్‌, రంజిత్‌, శ్రీనివాస్‌, కడారి శ్రీను తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-04-05T13:45:28+05:30 IST