ఎన్‌ఆర్‌ఐల సౌజన్యంతో ఆక్సిజన్‌ సిలిండర్లు

ABN , First Publish Date - 2021-05-06T06:21:02+05:30 IST

అంతర్వేది దేవస్థానం తీర ప్రాంత గ్రామాల్లో కొవిడ్‌ బారిన పడి ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతున్నవారు ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం సంప్రదించాలని వైసీపీ నాయకుడు నల్లి డేవిడ్‌ కోరారు.

ఎన్‌ఆర్‌ఐల సౌజన్యంతో ఆక్సిజన్‌ సిలిండర్లు

అంతర్వేది, మే 5: అంతర్వేది దేవస్థానం తీర ప్రాంత గ్రామాల్లో కొవిడ్‌ బారిన పడి ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతున్నవారు ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం సంప్రదించాలని వైసీపీ నాయకుడు నల్లి డేవిడ్‌ కోరారు. స్థానిక ఎన్‌ఆర్‌ఐలు ఆరు ఆక్సిజన్‌ సిలిండర్లను సెవెల్‌స్టార్స్‌ యూత్‌ ధన సహాయంతో సమకూర్చారని తెలిపారు. ఇజ్రాయిల్‌లో ఉంటున్న అంతర్వేది తీర ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు సహాయ, సహకారాలు అందిస్తున్నారని అన్నారు. చొప్పల మధు, చేట్ల ఏసురత్నం, జిల్లెల్ల రాజేష్‌, నల్లి రాజేష్‌ల వద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నా యని, కావాల్సినవారు  వారిని సంప్రదించాలన్నారు.


Updated Date - 2021-05-06T06:21:02+05:30 IST