ఈ NRIలది ‘శ్రీమంతుడు’ స్టైల్.. పుట్టిన ఊరు కోసం ఒక్కటిగా..!

ABN , First Publish Date - 2021-08-27T00:19:53+05:30 IST

‘మనకు ఎంతో ఇచ్చిన ఊరికి మనం ఎంతోకొంత ఇవ్వాలి’ అనే డైలాగ్ విన్నారు కదా. శ్రీమంతుడు సినిమాలో చాలా పాపులర్ డైలాగ్..

ఈ NRIలది ‘శ్రీమంతుడు’ స్టైల్.. పుట్టిన ఊరు కోసం ఒక్కటిగా..!

చండీఘర్: ‘మనకు ఎంతో ఇచ్చిన ఊరికి మనం ఎంతోకొంత ఇవ్వాలి’ అనే డైలాగ్ విన్నారు కదా. శ్రీమంతుడు సినిమాలో చాలా పాపులర్ డైలాగ్ ఇది. పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్‌ ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే తాజాగా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు పంజాబ్‌కు చెందిన కొందరు ఎన్నారైలు. ఉన్నత చదువులు చదువుకుని విదేశాలలో ఉద్యోగాలు సాధించి స్థిరపడినా.. తమ స్వగ్రామాన్ని మాత్రం మర్చిపోలేదు. అక్కడి అనేక సమస్యలను తమ సొంత ఖర్చులతో పరిష్కరించారు. ఎన్నో మౌలిక సదుపాయాలను కల్పించారు. తాజాగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూపురేఖలనే మార్చేశారు.


వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని, నవన్‌షహర్, కరిహ గ్రామంలో ఓ ప్రభుత్వోన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. ఈ క్రమంలోనే స్థానిక డీఈవో దినేష్ కుమార్ ఆ పాఠశాల అభివృద్ధి కోసం నడుం బిగించారు. పంచాయతీ పెద్దలతో మాట్లాడారు. అలాగే గ్రామానికి చెందిన విదేశాల్లో నివశిస్తున్న అనేకమంది ఎన్నారైల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. తమ గ్రామంలో పాఠశాల ఇబ్బందుల్లో ఉందనే వార్త తెలియగానే.. అనేకమంది ఎన్నారైలు వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు రూ.18 లక్షలు వెచ్చించి పాఠశాలలో అన్ని రూపమే మార్చేశారు.


బల్లలు, బోర్డులు, బిల్డింగ్ మరమ్మతులు, సీసీ కేమెరాల ఏర్పాటు వంటి అనేక సదుపాయాలను సమకూర్చారు. వారందరి సాయంతో పాఠశాల రూపు రేఖలే మారిపోయాయి. ఈ క్రమంలోనే వారి దాతృత్వాన్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారందనినీ సత్కరించినట్లు డీఈవో దినేశ్ కుమార్ వెల్లడించారు. సాయం చేసిన వారిని గౌరవించుకోవడం, వారిని సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-27T00:19:53+05:30 IST