ఛీ..ఛీ.. ఈ NRI కు ఇదేం బుద్ధి.. కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్ల చేశాడు కానీ..

ABN , First Publish Date - 2022-05-31T02:32:36+05:30 IST

అతడో NRI. కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. కానీ.. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడు. ఓ రోజు ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పానీయం ఇచ్చాడు. స్పృహకోల్పోయిన కోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవలే అతడి పాపం పండటంతో అతడి బండారం బయటపడింది.

ఛీ..ఛీ.. ఈ NRI కు ఇదేం బుద్ధి.. కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్ల చేశాడు కానీ..

ఎన్నారై డెస్క్: అతడో NRI. కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. కానీ.. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడు. ఓ రోజు ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పానీయం ఇచ్చాడు. స్పృహకోల్పోయిన కోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవలే అతడి పాపం పండటంతో అతడి బండారం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  


పంజాబ్ రాష్ట్రం హొషియార్‌పూర్ జిల్లాకు చెందిన ఓ యువతికి కెనడాకు చెందిన యువకుడితో 2018లో వివాహం జరిగింది. పెళ్లికొడుకు తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో నివసిస్తుంటాడు. పెళ్లయిన కొద్ది రోజుల తరువాత.. ఆమె భర్త తన తల్లిదండ్రులతో కలిసి కనెడాకు వెళ్లిపోయాడు. రెండు మూడు నెలల్లో కోడలిని కూడా తీసుకెళతామని అతడి తండ్రి వధువు కుటుంబానికి మాటిచ్చాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఇండియాకు తిరిగొచ్చాడు. 


2019 నవంబర్ 11న..కోడలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పానీయం ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోగా..నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను వీడియోలో కూడా చిత్రీకరించాడు. ఆ తరువాత..వీటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. అతడి అరాచకాన్ని భరించలేకపోయిన ఆమె ధైర్యాన్నంతా కూడదీసుకుని ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చివరకు నిందితుడుపై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.



Updated Date - 2022-05-31T02:32:36+05:30 IST