Amerciaలో నా కూతురికి అనారోగ్యంగా ఉందట.. అంటూ తెలిసిన ఎన్నారైకు చెప్పడమే ఆ తల్లి పొరపాటయింది..!

ABN , First Publish Date - 2021-11-29T19:33:29+05:30 IST

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కూతురికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో.. ఆ తల్లి మనసు తల్లడిల్లింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లలేక.. తెలిసిన ఎన్నారైకి విషయం చెప్పడమే ఆమె చేసిన పొరపాటయింది. ఇటీవల ఓ రోజున అకస్మాత్తుగా వాట్సాప్‌లో కూతురి ఫొటోలు రావడం చూసి..

Amerciaలో నా కూతురికి అనారోగ్యంగా ఉందట.. అంటూ తెలిసిన ఎన్నారైకు చెప్పడమే ఆ తల్లి పొరపాటయింది..!

చెన్నై: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కూతురికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో.. ఆ తల్లి మనసు తల్లడిల్లింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లలేక.. తెలిసిన ఎన్నారైకి విషయం చెప్పడమే ఆమె చేసిన పొరపాటయింది. సడన్‌గా ఓ రోజు తన కూతురి నగ్న ఫొటోలు వాట్సప్‌కు రావడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. ఇంతకూ ఏమైందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడుకు చెందిన రాజేశ్వరి అనే మహిళ (పేరు మార్చడం జరిగింది) ఉన్నత చదువుల కోసం తన కూతురిని అమెరికాకు పంపించింది. ఈ క్రమంలోనే 2019లో సదరు యువతి ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయం రాజేశ్వరికి తెలిసింది. వెంటనే కూతురు వద్దకు వెళ్లలేక.. తన ఫ్రెండ్ భర్త సాయం తీసుకుంది. తన కూతురిని ఆసుపత్రిలో చూపించాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో తాజాగా తన కూతురి నగ్న ఫొటోలు ఓ అపరిచిత ఫోన్ నెంబర్ నుంచి రావడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. వెంటనే పోలీసుకుల సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఫొటోలు పంపిన వ్యక్తిని పట్టుకుని రాజేశ్వరి ముందు నిలబెట్టారు. ఈ క్రమంలో అతడికి చూసి, కంగుతింది. తన ఫ్రెండ్ భర్త రమేష్ ఈ పని చేసినట్టు గుర్తించి షాకైంది. తన కూతురు మానసిక ఆరోగ్యం బాగాలేనపుడు ఫొటోలు తీసినట్టు తెలుసుకుని విస్తుపోయింది. కాగా.. రమేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించారు. 



రమేష్ 1994లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడని పోలీసులు తెలిపారు. 2020లో ఇల్లు కొనుగోలు చేసేందుకు రాజేశ్వరి రమేష్ వద్ద రూ.50లక్షలను అప్పుగా తీసుకోవడంతో వాటిని అడగటానికి అతడు తాజాగా ఇండియాకు వచ్చినట్టు. ఈ క్రమంలో కూమారుడి ఉన్నత చదువుల కోసం.. తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని రాజేశ్వరిని రమేష్ అడిగినట్టు వెల్లడించారు. అకస్మాత్తుగా అడగడంతో ప్రస్తుతం డబ్బులు లేవని రాజేశ్వరి చెప్పిందని.. దీంతో కోపం పెంచుకున్న రమేష్.. 2019లో తీసిన ఫొటోలను విదేశీ నెంబర్ ద్వారా రాజేశ్వరికి పంపించి.. రూ.1.87కోట్లు డిమాండ్ చేసినట్టు వివరించారు. 




Updated Date - 2021-11-29T19:33:29+05:30 IST