గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి

ABN , First Publish Date - 2022-05-27T06:35:03+05:30 IST

మరికొద్దిరోజుల్లో అమెరికా వెళ్లాల్సిన ఎన్‌ఆర్‌ఐ గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రికి ఆరోగ్యం బాగా లేదని ఏడు నెలల కిందట అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. ఐదు

గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి
రాంరెడ్డి(ఫైల్‌ ఫొటో)

 ఏడు నెలల కిందట తండ్రి కోసం స్వగ్రామానికి

 తండ్రికి ఆరోగ్యం బాగోలేదని వచ్చి ఇక్కడ మృతి

 జూన్‌ 11న అమెరికా వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే విషాదం

 అంత్యక్రియలకు అమెరికా నుంచి రానున్న కుటుంబసభ్యులు

నేరేడుచర్ల, మే 26 : మరికొద్దిరోజుల్లో అమెరికా వెళ్లాల్సిన ఎన్‌ఆర్‌ఐ గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రికి ఆరోగ్యం బాగా లేదని ఏడు నెలల కిందట అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెంద గా, తల్లి కోసం రెండు నెలలుగా ఇంటి వద్దనే ఉం టున్నాడు. వచ్చే నెల 11న అమెరికా వెళ్లాల్సి ఉం ది. ఇంతలోనే అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెం దాడు. ఈ హృదయ విదారక సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మం డలం దాచారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దాచారం గ్రామానికి చెందిన మందడి ముత్యంరెడ్డి సర్పంచ్‌గా, నీటి సంఘం చైర్మన్‌గా, తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేశాడు. ముత్యంరెడ్డి ముగ్గురు కుమారులు రాంరెడ్డి, వెంకటరెడ్డి, సంతో్‌షరెడ్డిలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఏడు నెలల క్రితం ముత్యంరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లి పిచ్చమ్మకు తోడుగా ఉండి, తండ్రికి వైద్యం చేయించేందుకు పెద్ద కుమారుడు రాంరెడ్డి (39) ఇండియాకు వచ్చాడు. ఐదు నెలల క్రితం ముత్యంరెడ్డి మృతి చెందటంతో, ఇద్దరు కుమారులు ఇండియాకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తమ్ముళ్లు, భార్య మౌనిక, కుమారుడు వేదవ్యాస్‌రెడ్డి అమెరికా వెళ్లిపోగా, తల్లి పిచ్చమ్మతో కలిసి రాంరెడ్డి దాచారం గ్రామంలోనే ఉంటున్నాడు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో జూన్‌ 11న అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తల్లి పిచ్చమ్మ కుమారుడి కోసం టిఫిన్‌ తెచ్చేందుకు బయటకు వెళ్లగా, ఇంట్లో ఉన్న రాంరెడ్డి రెండుసార్లు వాంతి చేసుకున్నాడు. తల్లి వచ్చే సరికి రాంరెడ్డి స్పృహ కోల్పోయి, శరీరమంతా చమటలు పట్టి చల్లగా మారడంతో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. ఈ హృదయ విదారక సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాంరెడ్డి మృతితో  భార్య మౌనిక, కుమారుడు వేదవ్యా్‌సరెడ్డి, సోదరులు వెంకటరెడ్డి, సంతో్‌షరెడ్డిలు అమెరికా నుంచి బయలుదేరారు. రాంరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు.

ఎమ్మెల్యే నివాళి

మందడి రాంరెడ్డి మృతదేహానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆ యన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సురే్‌షబాబు, కడియం వెంకటరెడ్డి, అనంతు శ్రీను, అన్నపురెడ్డి నారాయణరెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి, సిరికొండ వెంకటేశ్వర్లు, రాజేష్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:35:03+05:30 IST