పెళ్లయినా.. కుదరని కలయిక! నెలరోజులకే విడిపోయిన NRI జంట! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-21T03:42:33+05:30 IST

పెళ్లైన నెలరోజులకే ఓ ఎన్నారై జంటకు అహ్మదాబాద్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఒకరిని చూస్తే మరొకరికి లైంగిక ఉద్దీపనలు కలగటం లేదని, అనాసక్తి నెలకొందని మహిళ కోర్టుకు తెలపగా.. భర్త కూడా ఆమె వాదనను సమర్థించాడు దీంతో.. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

పెళ్లయినా.. కుదరని కలయిక! నెలరోజులకే విడిపోయిన NRI జంట! అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: పెళ్లైన నెలరోజులకే ఓ ఎన్నారై జంటకు అహ్మదాబాద్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఒకరిని చూస్తే మరొకరికి లైంగిక ఉద్దీపనలు కలగటం లేదని, అనాసక్తి నెలకొందని మహిళ కోర్టుకు తెలపగా.. భర్త కూడా ఆమె వాదనను సమర్థించాడు దీంతో.. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే.. ఇలాంటి కారణంతో కోర్టు విడాకులు మంజూరు చేయడం చాలా అరుదని న్యాయనిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిన కారణాలు రుజువు చేసేందుకు సాక్షులు ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించిన  కోర్టు.. శారీరకంగా వారు దగ్గరకాలేదు కాబట్టి ఈ కేసులో చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోనవసరం లేదని పేర్కొంది. వివాహం రద్దకు భార్యాభర్తలు ఇద్దరూ అంగీకరించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.


ఆ జంటకు జనవరిలో వివాహం జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. తరువాత వారు హనీమూన్‌కు వెళ్లారు. తిరిగొచ్చాక భార్య అత్తారింట్లో కాక మరోచోట నివసించసాగింది. కొన్నాళ్ల తరువాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. సైకియాట్రిస్టులు అభిప్రాయం ప్రకారం.. ఇటువంటి పరిస్థితి ఏ జంట అయినా ఎదుర్కోవచ్చు. పెద్దలు కుదిర్చిన కొన్ని వివాహాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. భార్యాభర్తలు మానసికంగా ఒకరికొకరు దగ్గరకాలేక, సర్దుకుపోలేక ఇబ్బంది పడతారు. అంతేకాకుండా.. తాము ఊహించుకున్న లక్షణాలు భాగస్వామిలో లేకపోవడం, లేదా పార్నొగ్రఫీకి అలవాటుపడటం కారణంగా పరస్పర లైంగికాసక్తి తగ్గుతుందని  సైకియాట్రిస్టులు చెబుతారు. కొన్ని సందర్భాల్లో కౌన్సెలింగ్ ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా వారంటున్నారు.

Updated Date - 2022-03-21T03:42:33+05:30 IST