Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ కారు ఆపమని పోలీసులు చెప్పారు.. ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు.. ఓ NRI ఆవేదన!

twitter-iconwatsapp-iconfb-icon
టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ కారు ఆపమని పోలీసులు చెప్పారు.. ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు.. ఓ NRI ఆవేదన!

ఎన్నారై డెస్క్: జాంబియా దేశానికి చెందిన ఓ భారత సంతతి వ్యక్తి అహ్మదాబాద్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. అనధికార తనిఖీలు చేపట్టి.. తన వద్ద స్కాచ్ బాటిళ్లు ఉన్నాయన్నా సాకుతో రూ.40 వేలు వసూలు చేశారని చెప్పారు. ఓ ఎన్నారైగా రెండు బాటిళ్ల మద్యం వెంట తీసుకెళ్లే హక్కు తనకు ఉందని చెప్పినా వినిపించుకోలేదని ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జోతీంద్ర పటేల్ అనే వ్యక్తి జాంబియా దేశ పౌరుడు. ఆయనకు గుజరాత్‌లోని వడోదరలో ఓ ఇల్లు కూడా ఉంది. కాగా.. మార్చి 4న ఆయన ఇండియాకు వచ్చారు. జ్యోతీంద్రను తీసుకెళ్లేందుకు ఆయన స్నేహితులు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కాగా.. కారులో తామందరం ఎక్స్‌ప్రెస్ వేపై వెళుతుండగా.. పోలీసులు తమను టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ కారు ఆపమని సూచించారని జోతీంద్ర తెలిపారు. 

‘‘అది తెల్లవార్జాము కావడంతో ఇంకా చీకటిగానే ఉంది. అక్కడ ఆరుగురు పోలీసులు ఉన్నారు. వెంట మద్యం తీసుకెళుతున్నారా అని మమ్మల్ని అడిగారు. ఆ తరువాత వారు మా కారు తాళాలు తీసుకున్నారు. డీక్కీ తెరవమని చెప్పారు. అక్కడ రెండు మద్యం బాటిళ్లు కనిపించాయి. వెంటనే నా పాస్‌పోర్టు తీసేసుకున్నారు. మద్యం బాటిళ్లు తీసుకెళుతున్నందుకు జరిమానా కింద 2500 డాలర్లు కట్టమన్నారు. నేను జాంబియా దేశ పౌరుడినని, ఆ బాటిళ్లు తీసుకెళ్లే హక్కు నాకుందని చెప్పాను. కానీ.. వారు కారూ కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. పాస్‌పోర్టు వెనక్కు ఇచ్చేందుకు కూడా ఒప్పుకోలేదు. ఆ కారు నా ఫ్రెండ్‌ది కావడంతో అతడు భయపడిపోయాడు. చివరికి రూ. 40 వేలు చెల్లించాలన్నారు. నా దగ్గర అంత క్యాష్ లేదని చెప్పా. వాళ్లేమో ఏటీఎమ్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసుకురమ్మన్నారు. చివరికి వారు కోరినట్టు రూ. 40 వేలు ఇచ్చి పాస్‌పోర్టు వెనక్కు తెచ్చుకున్నాను’’ అని పటేల్ ఆరోపించారు. 

కారు డ్రైవర్ కూడా పోలీసులకు రూ.3 వేలు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చిన నా మనవరాలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొందని చెప్పారు. ‘‘నేను ఈ విషయాన్ని అక్కడితో మర్చిపోదామనుకున్నాను. కానీ.. నా మనవరాలి విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె బుధవారం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. అయితే.. నన్ను ఆపినట్టే పోలీసులు ఆమెను కూడా చెకింగ్ పేరిట అదే ప్రాంతంలో ఆపారు. అక్కడున్న ఓ ఇద్దరు పోలీసుల వద్ద రెండు గన్నులు కూడా ఉన్నాయి. తన వయసు 18 అని, మద్యం వెంట తీసుకెళ్లట్లేదని కూడా చెప్పింది. కానీ.. వారు ఆమె పాస్‌పోర్టును తీసుకున్నారు. లగేజీ చెక్ చేశారు. కానీ.. వాళ్లకు అనుమానాస్పందంగా ఏమీ కనిపించలేదు. దీంతో.. వారు ఆమెను వదిలేశారు. అసలు మాతో ఇలా ప్రవర్తించేందుకు, డబ్బులు వసూలు చేసేందుకు వారికి ఏ హక్కు ఉంది’’ అని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ పటేల్.. సీఎం భూపేంద్ర పటేల్‌కు, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ సంజయ్ శ్రీవాత్సవకు లేఖ కూడా రాశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.