అమరావతి: ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు డబ్బులు చెల్లించలేదని దాఖలైన 500 పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వినిపించారు. హైకోర్టులో విచారణకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ హాజరైనారు. నరేగా పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని కోర్టుకు సీఎస్ చెప్పారు. సీఎస్ ఆదిత్యనాథ్ స్టేట్మెంట్ హైకోర్టు రికార్డు చేసింది. ఏపీలో చేపట్టిన నరేగా పనులకు మొత్తం డబ్బులు చెల్లించామని కేంద్రం కోర్టుకు తెలిపింది. విచారణ జరుగుతున్నట్టు తమకు నివేదిక లేదని కేంద్రం పేర్కొంది. ఈ నెల 29కి తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. 29న తుది ఉత్తర్వులు ఉంటాయని జస్టిస్ బట్టు దేవానంద్ స్పష్టం చేసింది.