నౌకాసనంతో జీర్ణం తేలిక
ABN , First Publish Date - 2020-08-16T05:30:00+05:30 IST
ఈ ఆసనం పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో మలబద్ధకం, జీర్ణసమస్యలు దరిచేరవు. ఈ ఆసనం ఎలా వేయాలంటే...
ఈ ఆసనం పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో మలబద్ధకం, జీర్ణసమస్యలు దరిచేరవు. ఈ ఆసనం ఎలా వేయాలంటే...
- నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులు, కాళ్లు రిలాక్స్‌గా పెట్టాలి.
- ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి నెమ్మదిగా కాళ్లను పైకి లేపాలి. అదే సమయంలో ఛాతీ భాగాన్ని పైకి లేపాలి.
- చేతులను మెకాళ్లకు ఆనిస్తున్నట్టుగా పెట్టాలి. శరీరం ‘వి’ ఆకారంలో ఉండాలి.
- ఈ భంగిమలో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండాలి. తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ యథాస్థానానికి రావాలి.
- ఇలా ఈ ఆసనాన్ని రోజుకు నాలుగైదు సార్లు చేయాలి.