ఇప్పుడు కోర్టులు కాదంటున్నాయి: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-03-04T02:01:43+05:30 IST

రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికి ఉందని కేంద్రం చెబుతోందని, కానీ

ఇప్పుడు కోర్టులు కాదంటున్నాయి: మంత్రి బొత్స

అమరావతి: రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికి ఉందని కేంద్రం చెబుతోందని, కానీ ఇప్పుడు కోర్టులు కాదంటున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనిపై విస్త్రత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హైకోర్టు చెప్పినట్టు రాజధాని భూముల అభివృద్ధికి కట్టుబడే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు ఏం చేశామో కూడా అఫిడవిట్ వేస్తామని ఆయన తెలిపారు. రాజధాని భూములు రాజధాని అభివృద్ధి కోసమే తనఖా పెట్టాలంటున్నారన్నారు. మేం రాజధాని ప్రాంతాల అభివృద్ధి కోసమే అలా చేశామన్నారు. రాజధాని భూములు తనఖా పెట్టారంటూ వేగ్‌గా మాట్లాడొద్దని ఆయన హితవు పలికారు. మూడు రాజధానుల బిల్లు కోసం రాజధాని రైతుల్నే కాదు రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల్ని అడుగుతామని మంత్రి బొత్స పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-04T02:01:43+05:30 IST