రూ. 110కి చేరువ‌లో పెట్రోల్‌...

ABN , First Publish Date - 2021-06-24T13:43:33+05:30 IST

దేశంలో ఈరోజు పెట్రోల్ ధర 26 పైసలు...

రూ. 110కి చేరువ‌లో పెట్రోల్‌...

న్యూఢిల్లీ: దేశంలో ఈరోజు పెట్రోల్ ధర 26 పైసలు, డీజిల్ ధర లీటరుకు 7 పైసలు పెరిగింది. ఈరోజు ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ. 97.76కు చేరుకోగా, డీజ‌ల్ ధ‌ర లీటరుకు రూ. 88.30 కు చేరుకుంది. బ్రెంట్ ముడిచమురు ధర బుధవారం బ్యారెల్‌కు 75 డాల‌ర్ల‌ను దాటింది. బ్రెంట్ ముడి ధర ఈ స్థాయిని దాటడం గత రెండేళ్లలో ఇదే మొదటిసారి. డీజ‌ల్ ధర మే 4 నుంచి ఇప్పటి వరకు  లీటరుకు రూ.7.52 పెరిగింది. అదే సమయంలో పెట్రోల్ ధ‌ర  లీటరుకు 7.44 రూపాయలు పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూక‌శ్మీర్‌, లడఖ్‌ల‌లోపెట్రోల్ రిటైల్ ధర లీటరుకు రూ.100 దాటింది. 


ముంబై, హైదరాబాద్, బెంగళూరు మెట్రోలలో పెట్రోల్ ధ‌ర ఇప్పటికే లీటరుకు 100 రూపాయలు దాటి, రూ. 110కి చేరుకుంటోంది. పెట్రోల్, డీజ‌ల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర ప‌న్నులు జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ తొల‌గిస్తే డీజ‌ల్, పెట్రోల్ రేటు లీటరుకు సుమారు రూ. 27గా ఉండేది. అయితే అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ  పన్నును తొలగించలేవు. ఎందుకంటే ప్ర‌భుత్వాల‌కు ఈ  మార్గంలోనే ఆదాయం అధికంగా వ‌స్తుంటుంది.

Updated Date - 2021-06-24T13:43:33+05:30 IST