Abn logo
Jul 30 2021 @ 07:44AM

తెలుగు భాషలో పేరెంట్స్‌ గైడ్‌

హైదరాబాద్‌ సిటీ : సామాజిక మాధ్యమాలు మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై ఉన్న యువతకు భద్రతను అందించడంలో భాగంగా, ఇన్‌స్టాగ్రామ్‌ ప్రత్యేకంగా తెలుగు భాషలో పేరెంట్స్‌ గైడ్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలలోని తల్లిదండ్రులు అతి సులభంగా దీని ద్వారా పలు అంశాలను అభ్యసించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న అన్ని భద్రతా ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించడం ద్వారా యువత సురక్షితంగా ఉండడంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ అండ్‌ కమ్యూనిటీ ఔట్‌రీచ్‌ మేనేజర్‌ తారాబేడీ గురువారం జరిగిన వెబినార్‌లో వెల్లడించారు.


ఈ గైడ్‌లో చిన్నారుల హక్కులు - భద్రతపై అతి చురుకుగా పనిచేస్తోన్న కీలక సంస్థలు - సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌, సైబర్‌పీస్‌ ఫౌండేషన్‌, ఆరంభ్‌ ఇండియా ఇనీషియేటివ్‌, యంగ్‌ లీడర్స్‌ ఫన్‌ యాక్టివిటీ సిటిజన్‌షిప్‌, ఇట్స్‌ ఓకే టు టాక్‌, సూసైడ్‌ ప్రివెన్షన్‌ ఇండియా ఫౌండేషన్‌ అందించిన సమాచారం సైతం ఉందన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌పై లభ్యమవుతున్న నూతన భద్రతా ఫీచర్ల సంబంధించిన సమాచారం సైతం అందుబాటులో ఉందన్నారు.