UAE: ఇంటి దగ్గర నుంచే స్మార్ట్‌ఫోన్‌తో రెసిడెన్సీ పర్మిట్

ABN , First Publish Date - 2021-07-25T18:43:59+05:30 IST

యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ పర్మిట్ పొందడం మరింత సులువు చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంటి దగ్గర నుంచే రెసిడెన్సీ పర్మిట్ తీసుకోవచ్చు.

UAE: ఇంటి దగ్గర నుంచే స్మార్ట్‌ఫోన్‌తో రెసిడెన్సీ పర్మిట్

అబుధాబి: యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ పర్మిట్ పొందడం మరింత సులువు చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంటి దగ్గర నుంచే రెసిడెన్సీ పర్మిట్ తీసుకోవచ్చు. దీనికోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనల్(ఐసీఏ) “ica uae smart” ఎలక్ట్రానిక్ ఆప్లికేషన్‌ను తీసుకొచ్చింది. అలాగే అధికారిక వెబ్‌సైట్ “ica.gov.ae” ద్వారా కూడా రెసిడెన్సీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనుక ఇకపై రెసిడెన్సీ పర్మిట్ల కోసం ప్రత్యేకంగా ఐసీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆరు స్టెప్పుల్లో పూర్తి అవుతుంది. 


మొదట యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో దరఖాస్తు దారుడి ప్రాథమిక వివరాలతో డిజిటల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెసిడెన్సీ పర్మిట్ జారీ ఆప్షన్‌ను ఎంచుకుని అవసరమైన డేటాను ఎంటర్ చేయడంతో పాటు ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రాసెస్ అయిన తర్వాత పర్మిట్ జారీ అవుతుంది. పర్మిట్ వచ్చిన తర్వాత మన పాస్‌పోర్టును సంబంధిత అధికారులకు ఇస్తే, దానిపై పర్మిట్ స్టిక్కర్లను వేసి మన చేతికి ఇస్తారు. ఇదే విధంగా వర్క్ పర్మిట్లను కూడా జారీచేసే యోచనలో యూఏఈ కార్మికశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.  


Updated Date - 2021-07-25T18:43:59+05:30 IST