ఉత్తరాఖండ్‌లో అడుగుపెట్టాలంటే కొవిడ్ టెస్ట్ తప్పనిసరి!

ABN , First Publish Date - 2020-11-29T05:05:41+05:30 IST

ఉత్తరాఖండ్‌లో ఇటీవల కొవిడ్-19 పాజిటివ్ కేసులు అమాంతం పెరగడంతో అక్కడి పోలీసులు ఇవాళ కీలక నిర్ణయం...

ఉత్తరాఖండ్‌లో అడుగుపెట్టాలంటే కొవిడ్ టెస్ట్ తప్పనిసరి!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఇటీవల కొవిడ్-19 పాజిటివ్ కేసులు అమాంతం పెరగడంతో అక్కడి పోలీసులు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వివరాలను నిశితంగా పరిశీలించనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకించి డెహ్రాడూన్‌లో కరోనా మహమ్మారి విజృంభించడంతో పోలీసులు తాజా నిర్ణయం తీసుకున్నారు. ‘‘బయటి నుంచి ఉత్తరాఖండ్ వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వివరాలు నమోదు చేయనున్నాం. ఇప్పటికే సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ మేరకు స్పష్టమైన అదేశాలు వెళ్లాయి..’’ అని డీఐజీ అరుణ్ మోహన్ జోషి పేర్కొన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రత్యేకించి ఢిల్లీ నుంచి వచ్చే వారికి ఆష్క్రోడి, కుల్హాన్‌తో పాటు పాస్ గేట్ బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద  రాపిడ్ యాంటీజెన్ కొవిడ్-19 టెస్ట్ పూర్తయ్యాకే ప్రవేశానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో 4,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి  వరకు ఇక్కడ 67,514 మంది కరోనా బారి నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 

Updated Date - 2020-11-29T05:05:41+05:30 IST