Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 5 2021 @ 11:53AM

నవంబరులో రికార్డు స్థాయిలో వర్షపాతం

                 - ఆరు దశాబ్దాలలో ఇదే అత్యధికం 


బెంగళూరు: రాష్ట్రంలో నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాలు ఆరు దశాబ్దాల అవధిలో ఇదే అత్యధికమని రాష్ట్ర వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసే వర్షపాతం ఈసారి ఎన్నోరెట్లు ఎక్కువగా ఉందని ప్రకటనలో పేర్కొంది. నవంబరు నెలలో అయితే ఏకంగా 200 రెట్లు అధికమన్నారు. నవంబరు నెలలో సాధారణంగా 41.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుండగా ఈ ఏడాది నవంబరులో ఏకంగా 145 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు. చిక్కబళ్ళాపుర జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయింది. చిక్కబళ్ళాపురలో నవంబరులో సహజంగా 53.2 మి.మీ. వర్షపాతం నమోదవుతుంటే అల్పపీడన ప్రభావం కారణంగా ఈసారి 277.4 శాతం వర్షపాతం నమోదయింది. అంటే మామూలు వర్షపాతంతో పోలిస్తే 451శాతం అధికం. బెంగళూరు నగరంలో 329 శాతం, బెంగళూరు గ్రామీణ జిల్లాలో 356 , రామనగర్‌లో 302 శాతం, కోలారులో 345 శాతం, తుమకూరులో 413శాతం, చిత్రదుర్గలో 266 శాతం, మైసూరులో 204 శాతం, మండ్యలో 271 శాతం, బళ్ళారిలో 410 శాతం, రాయచూరులో 207 శాతం, బెళగావిలో 217 శాతం, ధార్వాడలో 214 శాతం వర్షపాతం నమోదైందన్నారు. శివమొగ్గలో 286, హాసన్‌లో 299, చిక్కమగళూరులో 261, దక్షిణకన్నడ జిల్లాలో 252, ఉడుపిలో 350, ఉత్తరకన్నడలో 358 శాతం వర్షపాతం నమోదైందని ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement