జొకో 13వసారి

ABN , First Publish Date - 2022-07-05T10:00:34+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ టైటిల్‌ నిలబెట్టుకొనే దిశగా దూసుకుపోతున్నాడు.

జొకో 13వసారి

క్వార్టర్‌ఫైనల్లో సెర్బియా వీరుడు 

బడోసాకు హలెప్‌ షాక్‌

లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ టైటిల్‌ నిలబెట్టుకొనే దిశగా దూసుకుపోతున్నాడు. అలాగే పురుషుల్లో 11వ సీడ్‌ ఫ్రిట్జ్‌, కిర్గియోస్‌, క్రిస్టియన్‌ గారిన్‌ కూడా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించగా, 19వ సీడ్‌ డిమినార్‌ పరాజయం పాలయ్యాడు. మహిళల్లో నాలుగో సీడ్‌ బడోసాకు మాజీ చాంపియన్‌ హలెప్‌ షాకిచ్చింది. ఇక 17వ సీడ్‌ రిబకినా సైతం క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నాలుగో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6-2, 4-6, 6-1, 6-2 స్కోరుతో టిమ్‌ (హాలెండ్‌)పై గెలుపొందాడు.


ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో జొకో 13వసారి క్వార్టర్‌ఫైనల్‌ చేరడం విశేషం. హలెప్‌ (రొమేనియా) 6-1, 6-2 స్కోరుతో బడోసా (స్పెయిన్‌)పై నెగ్గి చివరి ఎనిమిది మందిలో ప్రవేశించింది. 17వ సీడ్‌ రిబకినా (రష్యా) 7-5 6-3 స్కోరుతో మార్టిక్‌ (క్రొయేషియా)పై, టొమ్లజొనోవిక్‌ (క్రొయేషియా) 4-6, 6-4, 6-3 స్కోరుతో అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌)పై, అనిసిమోవా (అమెరికా) 6-2, 6-3 స్కోరుతో హర్మనీ (ఫ్రాన్స్‌)పై రౌండ్‌-16లో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్‌ ఫ్రిట్జ్‌ 6-3, 6-1, 6-4 స్కోరుతో కుబ్లెర్‌ని, కిర్గియోస్‌ 4-6, 6-4, 7-6 (2), 3-6, 6-2 స్కోరుతో నకాషిమాని ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఇక అన్‌సీడెడ్‌ క్రిస్టియన్‌ గారిన్‌ 2-6, 5-7, 7-6 (3), 6-4, 7-6 (6) 19వ సీడ్‌ డిమినార్‌ను చిత్తుచేశాడు. కెరీర్‌లో తొలిసారి అతడు గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌కు చేరాడు.

Updated Date - 2022-07-05T10:00:34+05:30 IST