వావ్‌.. నొవాక్‌

ABN , First Publish Date - 2022-07-06T09:59:28+05:30 IST

డిఫెండింగ్‌ చాంప్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తడబడినా.. నిలదొక్కుకొని వింబుల్డన్‌ సెమీ్‌సకు చేరుకున్నాడు.

వావ్‌.. నొవాక్‌

తొలి రెండు సెట్లు కోల్పోయినా గెలిచి సెమీ్‌సకు

మహిళల సెమీ్‌సలో మరియా, జెబ్యూర్‌

వింబుల్డన్‌ 

లండన్‌: డిఫెండింగ్‌ చాంప్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తడబడినా.. నిలదొక్కుకొని వింబుల్డన్‌ సెమీ్‌సకు చేరుకున్నాడు. పదో సీడ్‌ జానిక్‌ సిన్నర్‌తో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను చేజార్చుకున్నా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచిన మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ జొకో 5-7, 2-6, 6-3, 6-2, 6-2తో సిన్నర్‌ (ఇటలీ)పై కష్టపడి నెగ్గాడు.


మరో మ్యాచ్‌లో 9వ సీడ్‌ కామెరూన్‌ నోరి (బ్రిటన్‌) 3-6, 7-5, 2-6, 6-3, 7-5తో డేవిడ్‌ గోఫిన్‌పై నెగ్గి సెమీస్‌ చేరాడు. ఇక.. మహిళల సింగిల్స్‌లో ఇద్దరు పిల్లల తల్లయిన 34 ఏళ్ల టాట్జానా మరియా తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీ్‌సలోకి అడుగుపెట్టింది. మరియా (జర్మనీ) 4-6, 6-2, 7-5తో తన దేశానికే చెందిన నిమీర్‌ను ఓడించింది. దీంతో ఓపెన్‌ ఎరాలో 34 ఏళ్ల వయసులో గ్రాస్‌ కోర్టులో సెమీస్‌ చేరిన ఆరో ప్లేయర్‌గా రికార్డుకెక్కింది. మరో క్వార్ట ర్స్‌లో మూడోసీడ్‌ ఆన్స్‌ జెబ్యూర్‌ (ట్యునీషియా) 3-6, 6-1, 6-1తో మారి బౌజ్క్‌కొవా (చెక్‌)పై నెగ్గి మరియాతో సెమీస్‌ పోరుకు సిద్ధమైంది. 


క్వార్టర్స్‌లో నడాల్‌:

రెండో సీడ్‌ రఫెల్‌ నడాల్‌ 6-4, 6-2, 7-6(6)తో బోటిక్‌ వాన్‌ డి జాండ్స్‌చుల్ప్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచి క్వార్టర్స్‌ చేరాడు. 

Updated Date - 2022-07-06T09:59:28+05:30 IST