నో వ్యాక్సిన్‌.. నో ఎంట్రీ

ABN , First Publish Date - 2022-08-14T09:00:09+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోని నొవాక్‌ జొకోవిచ్‌ మరో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

నో వ్యాక్సిన్‌.. నో ఎంట్రీ

‘సిన్సినాటి’ నుంచి వైదొలగిన జొకో

సిన్సినాటి : కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోని నొవాక్‌ జొకోవిచ్‌ మరో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారికి అమెరికాలో ప్రవేశం నిషేధించారు. దాంతో వచ్చే వారం జరిగే సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నమెంట్‌నుంచి ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జొకో తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు..ఈనెల 29 నుంచి జరిగే ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లోనూ సెర్బియా స్టార్‌ పాల్గొనే అవకాశాలు లేవు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుండా గత జనవరిలో ఆస్ట్రేలియాలో ప్రవేశించిన జొకోను ఆ దేశంనుంచి పంపివేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను అతడు మిస్సయ్యాడు. 

Updated Date - 2022-08-14T09:00:09+05:30 IST